Bank Holidays: తెలుగు రాష్ట్రాల్లో దసరా తర్వాతి రోజు కూడా బ్యాంకులు ఉండవా..? ఈ విషయం తెలుసుకోండి..
బ్యాంకింగ్ ఖాతాదారులు సెలవుల గురించి అవగాహన కలిగి ఉండాలి. దీని వల్ల లావాదేవీలు నిర్వహించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దసరా వేళ అక్టోబర్ 20న బ్యాంకులు మూతపడ్డాయి. అయితే అక్టోబర్ 21న కూడా బ్యాంకులు మూసి ఉంటాయా? అనే అనుమానం చాలామందిలో ఉంది.

దసరా పండుగ కావడంతో అక్టోబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. అయితే దసరా తర్వాతి రోజు అక్టోబర్ 21వ తేదీన కూడా బ్యాంకులు మూసివేసి ఉంటాయా? అనే డౌట్ చాలామందిలో కలుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 21న కూడా బ్యాంకులు బంద్ కానున్నాయి. బ్యాంక్ సెలవులు అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొ రాష్ట్రంలో ఒక్కలా సెలవులు ఉంటాయి. దీంతో మీరు బుధవారం బ్యాంక్‌కు వెళ్లాలనుకుంటే ఒకసారి మీ ప్రాంతంలో బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోండి. బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాలనుకుంటే ముందుగానే సిబ్బందిని సంప్రదించి నిర్దారణ చేసుకోడం మంచిది. దీని వల్ల మీకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకావు. సమయం, డబ్బులు ఆదా అవుతాయి. బ్యాంక్ దగ్గరికి వెళ్లిన తర్వాత లేకపోతే సమయం వృథా అయిందని బాధపడాల్సి ఉంటుంది. అక్టోబర్ 21న బ్యాంకులు ఉంటాయా..? ఉండవా? అనే విషయాలు తెలుసుకుందాం.
ఈ రాష్ట్రాల్లో మూతపడనున్న బ్యాంకులు
కొన్ని రాష్ట్రాల్లో దసరా 20వ తేదీ జరుపుకుంటుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 21న సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో ఆర్బీఐ రాష్ట్రాల సంస్కృతి, స్థానికంగా జరుపుకునే పండుగల సమాయాల్లో సెలవులు ప్రకటిస్తోంది. జాతీయ సెలవులు దేశం మొత్తానికి వర్తిస్తే.. ప్రాంతీయ సెలవులు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. అక్టోబర్ 21న విజయదశమి, దుర్గాపూజ సందర్భంగా బెంగళూరు, తిరువనంతపురం, కోల్ కత్తా, కొచ్చి, గౌహతి, గ్యాంగ్ టక్, అగర్తల, షిల్లాంగ్‌లలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. అక్టోబర్ 22,23వ తేదీల్లో దుర్గాపూజ కారణంగా సిక్కింలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. అయితే ఏపీ, తెలంగాణలో బుధవారం బ్యాంకులు యధావిధిగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే రేపు బ్యాంకులు ఉండవని చెప్పవచ్చు. ఇక ఈ వారంలో అక్టోబర్ 24వ తేదీన నాలుగో శనివారం రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ 25న ఆదివారం సాధారణ సెలవు దినం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోవాలనువారు ముందు పని పూర్తి చేసుకోవాలి. లేకపోతే సెలవు రోజుల్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
సెలవు రోజుల్లో ఇవి అందుబాటులో..
సెలవు రోజుల్లో బ్యాంకులు మూసివేసినంత మాత్రన బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్నీ నిలిచిపోవని అర్థం చేసుకోవాలి. నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, ఖాతా నిర్వహణ వంటి సాధారణ లావాదేవీలు ఏటీఎంలు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. భౌతికంగా శాఖను సందర్శించాల్సిన సేవలు మాత్రం సెలవు రోజుల్లో నిలిచిపోతాయి. ముందే సెలవుల గురించి తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడవచ్చు.
