AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Sipligunj: దసరా రోజున కొత్త టెస్లా కారు కొన్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ధర ఎంతో తెలుసా?

దసరా పర్వదినాన టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కొత్త కారు కొన్నాడు. అనంతరం తన భార్యతో కలిసి కొత్త కారు వద్ద ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. వీటిని చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు సింగర్ రాహుల్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Rahul Sipligunj: దసరా రోజున కొత్త టెస్లా కారు కొన్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ధర ఎంతో తెలుసా?
Rahul Sipligunj
Basha Shek
|

Updated on: Oct 20, 2026 | 5:19 PM

Share

దేశమంతా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే దసరా పండుగ రోజు ఏదైనా కొత్త పనులు ప్రారంభించినా, కొత్త వస్తువులు కొనుగోలు చేసిన అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే దసరా పండుగను పురస్కరించుకుని కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే కూడా ఎన్నో కొత్త సినిమాలు పూజా కార్యక్రమాలను జరుపుకొన్నాయి.ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు గ్రహీత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కొత్త కారును కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన భార్య హరిణ్య రెడ్డి)తో కలిసి కొత్త కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. ‘దుర్గామాత ఆశీస్సులతో ఈ ప్రత్యేకమైన సందర్భంలో కొత్త కారును కొనుగోలు చేశాం. అందరికీ దసరా శుభాకాంక్షలు’ అంటూ అందరికీ విషెస్ చెప్పాడు.

కొత్త కారుతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ దంపతులు దిగి న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రాహుల్ కు అభినందనలు చెబుతున్నారు. కాగా రాహుల్ కొనుగోలు చేసిన టెస్లా కారు ధర సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. కాగా రాహుల్ గ్యారేజ్‌లో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్, వోల్వో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు టెస్లా కారు కూడా చేరింది.

ఇవి కూడా చదవండి

కొత్త టెస్లా కారుతో రాహుల్ సిప్లిగంజ్- హరిణ్య దంపతులు..

కాగా ప్లే బ్యాక్ సింగర్ గా ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఆర్ఆర్ఆర్ సినిమాలో అతన పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సినిమాలతో పాటు ప్రస్తుతం పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు రాహుల్. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 27న వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.

సింగర్ సమీరా భరద్వాజ్ తో రాహుల్ సిప్లిగంజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us