నానితో శ్రీకాంత్ అడ్డాల సినిమా..?

|

Jun 01, 2019 | 9:39 AM

‘బ్రహ్మోత్సవం’ ప్లాప్ తర్వాత ఒక్క ఆఫర్ కూడా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తలుపు తట్టలేదు. అయన రీసెంట్‌గా పలు కథలతో యంగ్ హీరోల వద్దకు వెళ్లినా ఒక్కటి కూడా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ నానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కథ చెప్పాడని.. దానికి నాని కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై […]

నానితో శ్రీకాంత్ అడ్డాల సినిమా..?
Follow us on

‘బ్రహ్మోత్సవం’ ప్లాప్ తర్వాత ఒక్క ఆఫర్ కూడా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తలుపు తట్టలేదు. అయన రీసెంట్‌గా పలు కథలతో యంగ్ హీరోల వద్దకు వెళ్లినా ఒక్కటి కూడా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ నానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కథ చెప్పాడని.. దానికి నాని కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయింది.

మరోవైపు నాని ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అటు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో కూడా నాని ‘V’ అనే చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.