AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదే పదే బీపీ పెరుగుతోందా.. ఇలా జరిగితే మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నట్లే!

ఈ మధ్య కాలంలో చాలా మంద అధిక రక్తపోటు భారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య తలెత్తుతుంది. అయితే అసలు బీపీ ఎంత ఉంటే నార్మల్, ఎంత దాటింది అంటే మీ ప్రాణం రిస్క్‌లో ఉన్నట్లో ఇప్పుడు తెలుసుకోండి.

Samatha J
|

Updated on: Apr 17, 2026 | 7:16 PM

Share
అధిక రక్తపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒత్తిడి, డిప్రెషన్, అతిగా ఆలోచించడం వలన కొంత మందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి 120/80mmHg ఉంటే అది సాధారణం. కానీ దీనికి మించి ఉంటే అది అధిక రక్తపోటు సమస్యగా గుర్తించి, తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

1 / 5
అయితే కొన్ని సార్లు ఇది అకస్మాత్తుగా 200 దాటే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలా దాటింది అంటే అది తీవ్రమైన అనారోగ్య సమస్యగా గుర్తించాలి. ముఖ్యంగా ఇది మీ శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు అత్యవసర పరిస్థితిగా కూడా పరిగణించవచ్చు, ఇలానే కొనసాగితే ఇది మరణానికి కూడా దారితీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు పక్షవాతానికి కూడా దారితీస్తుందంట. అంతే కాకుండా ఇలా పదే పదే బీపీ పెరిగి, మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి, పక్షవాతం వస్తుంది. అయితే మీకు బీపీ సమస్య ఉన్నప్పుడు కొన్ని సార్లు వాంతులు, కళ్లు తిరగడం, కళ్లు మసకబారడం, మైకం కమ్మడం వంటి సమస్య ఎదురు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇది అధిక రక్తపోటుకు దారి తీసే ఛాన్స్ ఉన్నదంట.

3 / 5
అంతే కాకుండా ఇది గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సార్లు ఈ బీపీ సమస్య అధికం అయినప్పుడు ,అధిక రక్తపోటు వలన గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా హైబీపీ వలన ఇలాంటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే అధిక రక్తపోటు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

4 / 5
అంతే కాకుండా ఈ అధిక రక్తపోటు మూత్రపిండాలు, కళ్లపై ప్రభావం కూడా చూపుతుంది. అందుకోసమే హైబీపీ ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు బీపీ 170, 200 దాటినప్పుడే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి వైద్యం తీసుకొని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.  సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోగలరు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us