
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆరోజునే ప్రభాస్ ‘సాహో’ సినిమా కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను షురూ చేసింది. దీనిలో భాగంగా ఈ సినిమా టీజర్‌ను జూలై 24 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అటు ‘సాహో’ లాంటి పెద్ద చిత్రంతో పోటీ పడితే కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Meet PENCIL and his GANG on the 24th July! They are going to be a lot of FUN!
Teaser out at 11 AM #GANGLEADER ???? pic.twitter.com/Tld4acTCPl
— Mythri Movie Makers (@MythriOfficial) July 22, 2019