Nani interesting comments : నాతో ఆ సినిమా బలవంతంగా చేయించారు.. కానీ కెరియర్ కు అది ప్లస్ అయ్యింది..

యంగ్ హీరో నాని తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. నాని నటనకు నేచురల్ స్టార్ అనే బిరుదు దక్కింది. ఇక నాని వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు...

Nani interesting comments : నాతో ఆ సినిమా బలవంతంగా చేయించారు.. కానీ కెరియర్ కు అది ప్లస్ అయ్యింది..

Updated on: Jan 06, 2021 | 8:32 AM

Nani interesting comments : యంగ్ హీరో నాని తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. నాని నటనకు నేచురల్ స్టార్ అనే బిరుదు దక్కింది. ఇక నాని వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా నాని తన సినిమా పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తన తో బలవంతంగా సినిమా చేయించారట నిర్మాతలు. ఇంతకు ఆ సినిమా ఏమిటంటే ..

తాజాగా నాని అల్లుడు అదుర్స్ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ”నా కెరీర్ బిగినింగ్ లో ఒకసారి బెల్లంకొండ సురేష్ తో ‘రైడ్’ సినిమా చేయనని చెప్పడానికి ఆయన ఆఫీస్ కు వెళ్తే బలవంతంగా నాతో ఆ సినిమా చేయించారు. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ సినిమా నాకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయమని బెల్లంకొండ సురేష్ అడిగారు. ప్రసాద్ ల్యాబ్స్ లో షూటింగులో ఉంటానని చెప్పాను. అయితే ఆయన నా మాట వినకుండా ప్రసాద్ లాబ్స్ లోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పెట్టి నాతో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ఈ ట్రైలర్ కూడా కలిసి వస్తుంది అని అన్నారు. నాని కెరియర్ లో రెండో సినిమా రైడ్. తనీష్ మరో హీరోగా అక్ష – శ్వేతబసు ప్రసాద్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. నాని కి మాత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది.  రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Adipurush movie : ‘ఆదిపురుష్’లో లంకేశ్ డిఫరెంట్ లుక్.. సైఫ్ అలీఖాన్ ను అలా చూపించనున్నారట..

Raviteja Interview: లాక్‌డౌన్‌లో నేను అస్సలు బోర్‌ ఫీల్‌ కాలేదు.. చాలా నేర్చుకున్నాను: రవితేజ