Raviteja Interview: లాక్‌డౌన్‌లో నేను అస్సలు బోర్‌ ఫీల్‌ కాలేదు.. చాలా నేర్చుకున్నాను: రవితేజ

Raviteja About Lockdown Time: 'రాజా ది గ్రేట్‌' తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక సతమతమవుతున్నాడు మాస్‌ మహా రాజా రవితేజ...

Raviteja Interview: లాక్‌డౌన్‌లో నేను అస్సలు బోర్‌ ఫీల్‌ కాలేదు.. చాలా నేర్చుకున్నాను: రవితేజ
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2021 | 8:30 AM

Raviteja About Lockdown Time: ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక సతమతమవుతున్నాడు మాస్‌ మహా రాజా రవితేజ. 2017లో వచ్చిన ఈ చిత్రం తర్వాత రవి నాలుగు సినిమాల్లో నటించగా ఇవేవి ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందివ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ‘క్రాక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో మీరెలా గడిపారు అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘లాక్‌డౌన్‌ సమయం నాకు మాత్రం చాలా అద్భుతంగా గడిచింది. నేను సాధారణంగానే కుటుంబంతో ఎక్కువగా గడుపుతుంటాను. ఫ్యామిలీ మెన్‌ని. దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా కుటుంబంతో గడపగలినాను. అలాగే హ్యాపీగా వర్కవుట్స్‌ చేసుకున్నాను. అంతేకాందు ఇంటర్నెట్‌లో చాలా కంటెంట్‌ ఉంది. ఈ లాక్‌ డౌన్‌ సమయంలో బోలేడు సినిమాలు చూశాను. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా బోర్‌గా ఫీల్‌ కాలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక రవితేజ తన కుమారుడి సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజా ది గ్రేట్‌’లో అనిల్‌ పట్టుబట్టి మహాదన్‌తో ఆ పాత్ర చేయించాడు. ఇప్పుడు వాడు 9వ తరగతి చదువుతున్నాడు. సినిమాల్లో నటించడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ సమయానికి వాడికి ఏది అనిపిస్తే అదే చేయమని చెప్తాను’ అని చెప్పుకొచ్చాడీ స్టార్‌ హీరో. మరి ‘క్రాక్‌’తో నైనా రవితేజ నీరిక్షణ ఫలిస్తుందో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

Also Read: Anushka Sharma: ఈ సమయంలోనూ ఫిట్‏నెస్‏పై ధ్యాస పెట్టి అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!