
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్ర్ ప్రొడక్షన్ నెంబర్ 14గా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజేంద్ర నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన క్లాప్ కొట్టగా.. దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.హీరో కళ్యాణ్ రామ్, నిర్మాత నవీన్ యెర్నేని, సీఈఓ చెర్రీ.. చిత్ర దర్శకుడు రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు రాజేంద్ర దర్శకత్వం వహిస్తుండటంతో పాటు కథ, స్క్రీన్‌ప్లేను కూడా ఆయనే అందించారు. కళ్యాణ్ రామ్ ఒక వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి తన యన్.టి.ఆర్. ఆర్ట్స్ బ్యానర్‌పై తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా సినిమాను నిర్మించబోతున్నారు కళ్యాణ్ . మరోవైపు మైత్రీ మూవీస్ బ్యానర్‌లో తాను హీరోగా సినిమా చేస్తున్నారు. గతేడాది ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
Our Production No.14 starring @NANDAMURIKALYAN garu under the Direction of debutant Rajendra was launched today! Shoot begins in March 2nd week ?
More details soon! #NKR19 pic.twitter.com/tAvs6Meoj7
— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2021
Also Read: పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే ఆ సినిమా చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ క్రిష్