టాలీవుడ్ హీరో నాగార్జున విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మన్మథుడు-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్. కానీ అనుకున్నంత విజయాన్ని ఈ చిత్రం సాధించలేకపోయింది. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా చేశాడు. అదే సమయంలో తన తర్వాతీ చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ మూవీకి నాగ్ అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల కాలంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇందులో నాగార్జున స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు.
కరోనా సంక్షోభంతో మూతపడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. డిసెంబర్ 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నెలలో మరిన్ని సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆయా సినిమా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాను మాత్రం ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అందుకు తేదీని కూడా నిర్ణయించుకున్నాట్లుగా సమాచారం. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రం నిజంగానే ఓటీటీలో విడుదలవుతోందా ? లేక థియేటర్లలో విడుదల చేస్తారా అనే విషయం తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.