మహేశ్ హీరోగా సర్కార్ వారి పాట సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ మేకర్స్ సంస్థ మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది 2021 జనవరి నుంచి రెగ్యూలర్‌గా జరుపుకోనుంది.
అయితే మైత్రి మూవీస్ మేకర్స్ ఇదివరకే మహేశ్ నటించిన శ్రీమంతుడు సినిమా తెరకెక్కించింది. తాజాగా ఇప్పడు సర్కార్‌వారి పాట ను చేస్తోంది. శ్రీమంతుడు ఎంత భారీ హిట్ అయిందో అందరికి తెలిసిందే. దీంతో ఈ సంస్థకు మార్కెట్‌లో మంచి పేరు లభించింది. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అంతేకాకుండా శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7 వ తేదీన విడుదల చేశారు. ఇప్పుడు సర్కార్‌వారిపాట కూడా అదే రోజున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెంటిమెంట్‌ను మళ్లీ ఒకసారి రిపీట్ చేయాలని చూస్తున్నారు. దర్శకుడు పరశురాం కూడా ఈ రోజులోపే షూటింగ్ పూర్తిచేయాలని భావిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.