Ustad Rashid Khan Death: మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ ఇకలేరు.. సీఎం మమతా బెనర్జీ సంతాపం

మ్యూజిక్‌ మ్యాస్ట్రోగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) కన్నుమూశారు. గత కొంత కాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై, ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన్ని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాం..

Ustad Rashid Khan Death: మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ ఇకలేరు.. సీఎం మమతా బెనర్జీ సంతాపం
Ustad Rashid Khan

Updated on: Jan 09, 2024 | 7:36 PM

మ్యూజిక్‌ మ్యాస్ట్రోగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) కన్నుమూశారు. గత కొంత కాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై, ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన్ని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాం.. కానీ మా ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆయన మరణించారు అని ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.

ఉత్సాద్‌ రషీద్ ఖాన్ మరణం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ‘ఇది యావత్ దేశానికి, మొత్తం సంగీత సోదరులకు తీరని లోటు. రషీద్ ఖాన్ ఇక లేరని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బుధవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల సమయంలో గన్ సెల్యూట్, ప్రభుత్వ గౌరవం అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం మార్చురీలో ఉంచారు. అభిమానుల సందర్శనార్ధం బుధవారం రవీంద్ర సదన్‌కు ఆయన భౌతికకాయాన్ని తీసుకువెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఉత్సాద్‌.. రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్‌కు మునిమనవడు. గత నెలలో సెరిబ్రల్ అటాక్‌ సంభవించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అప్పటి నుంచి ఆయన వెంటిలేషన్‌పై ఉన్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.