ప్రముఖ నటి రోహిణిపై ఇళయరాజా ఫైర్

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. ప్రముఖ నటి రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 2న చెన్నైలో ఇళయరాజా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శంకర్, సినీ నటుడు విక్రమ్ తదితరులు హాజరయ్యారు. వీరిద్దరూ స్టేజ్ పైకి ఎక్కి ఇళయ రాజా సంగీతం గురించి గొప్పగా ప్రసంగించారు. ఈ నేపథ్యంలో షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న రోహిణి.. శంకర్ ను ఓ ప్రశ్న అడిగారు. ఇళయరాజాతో కలసి […]

ప్రముఖ నటి రోహిణిపై ఇళయరాజా ఫైర్

Edited By:

Updated on: Mar 05, 2019 | 9:18 AM

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. ప్రముఖ నటి రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 2న చెన్నైలో ఇళయరాజా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శంకర్, సినీ నటుడు విక్రమ్ తదితరులు హాజరయ్యారు. వీరిద్దరూ స్టేజ్ పైకి ఎక్కి ఇళయ రాజా సంగీతం గురించి గొప్పగా ప్రసంగించారు. ఈ నేపథ్యంలో షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న రోహిణి.. శంకర్ ను ఓ ప్రశ్న అడిగారు.

ఇళయరాజాతో కలసి ఎప్పుడు పనిచేస్తారు..? అభిమానుల మీ ఇద్దరి కాంబినేషన్ గురించి ఎదురు చూస్తున్నారని అడిగారు రోహిణి. దాంతో అక్కడే ఉన్న ఇళయరాజా రోహిణీ అడిగిన ప్రశ్నకు కోపగించుకున్నారు. అందరూ చూస్తుండగానే.. నువ్వు నాకు అవకాశం ఇప్పించాలని చూస్తున్నావా..? ఇది నాకు నచ్చలేదంటూ ఫైర్ అయ్యారు ఇళయరాజా. శంకర్ కు ఎవరితో కలిసి పనిచేయాలనిపిస్తే వారితోనే శంకర్ నటిస్తారంటూ రోహిణీపై సీరియస్ అయ్యారు. కంగారు పడిన రోహిణి తన ఉద్ధేశం అది కాదంటూ సర్దిచెప్పబోయింది. కాసేపటి తర్వాత రోహిణి అడిగిన ప్రశ్నకు దర్శకుడు శంకర్ సమాధానమిచ్చారు. ఇళయ రాజా సార్ పట్ల తనుకున్న గౌరవం, భయంతోనే.. ఆయనతో కలిసి ఇప్పటి వరకూ పనిచేయలేదన్నారు.

Follow Us