Vidyut Jamwal: పోలీసులు అదుపులో స్టార్ హీరో.. ఆ పని చేసినందుకే చేసినందుకే అరెస్ట్ చేశారా ?..
విద్యుత్ జమ్వాల్... బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. స్క్రీన్ పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో ఆయనే ముందుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వరల్డ్ వైడ్ ఉన్న ఆరు అగ్రశేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు జమ్వాల్. అలాంటి ఆయన ఇటీవల ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

రీల్ లైఫ్ వేరు.. రియల్ లైఫ్ వేరు.. వెండితెరపై ప్రేక్షకులకు అలరించేందుకు ఎలాంటి సాహాసాలు.. విన్యాసాలు చేసిన అంతగా పట్టించుకోరు.. కానీ నిజజీవితంలోనూ అలాంటి రిస్క్ స్టంట్స్ చేస్తే పోలీసులకు బదులు చెప్పాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎలాంటి చిన్న పని అయినా తెగ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా స్టార్ట్స్ వర్కవుట్స్.. పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు ఏదోక న్యూస్ హల్చల్ చేస్తుంటుంది. ఇక స్టార్స్ చేసే రిస్కీ స్టంట్స్, విన్యాసాల ఫోటోస్, వీడియోస్ కూడా వైరలవుతుంటాయి. అయితే అలాంటి వాటిపై కొందరు అడియన్స్ మద్దతు తెలుపితే.. మరికొందరు మాత్రం సీరియస్ అవుతుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరోకు అలాంటి చేదు అనుభవమే ఎదురైనట్లు కనిపిస్తుంది. విద్యుత్ జమ్వాల్… బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. స్క్రీన్ పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో ఆయనే ముందుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. వరల్డ్ వైడ్ ఉన్న ఆరు అగ్రశేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు జమ్వాల్. అలాంటి ఆయన ఇటీవల ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు ముంబై రైల్వే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. పోలీస్ స్టేషన్లో అధికారుల ముందు జమ్వాల్ కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అటు తన అరెస్ట్ గురించి వస్తున్న వార్తలపై జమ్వాల్ కూడా రియాక్ట్ కాకపోవడంతో ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. ముంబైలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఈ ఫోటో తీసినట్లుగా తెలుస్తోంది. అయితే జమ్వాల్ అరెస్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు.. కానీ ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు టాక్.
అయితే జమ్వాల్ ఫోటోపై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటో కేవలం తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్ నుంచి కావొచ్చని.. లేదా ప్రత్యేకంగా ఫోటోషూట్ చేస్తున్నారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం జమ్వాల్ కు మద్దతు తెలుపుతున్నారు. తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు జమ్వాల్. ప్రస్తుతం ఆయన నెక్ట్స్ సినిమా క్రాక్ జీతేగా తో జీగ త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ కీలకపాత్రలు పోషించగా.. ఆదిత్య దత్ దర్శకత్వం వహించారు. ఈనెల 23న ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.