అందాలతో మతిపోగొడుతున్న ఆషిక.. కుర్రాళ్లను ఆపతరమా.. 

Rajeev 

08 March 2025

అషికా రంగనాధ్.. కర్ణాటకలోని తుమకూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బుల్లితెర నుంచి తన కెరీర్ నుంచి ప్రారంభించింది. 

పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌‌గా నిలిచింది.

ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ‘క్రేజీ బాయ్’ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అషికా. 

‘రాంబో2’ మూవీతో తన తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. 

మరోవైపు ‘పట్టాత్తు ఆర్సన్’ అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా.. తెలుగు ప్రేక్షకులను ‘అమిగోస్’ చిత్రంతో పలకరించింది. 

ఆ తర్వాత ‘నా సామి రంగా’ చిత్రంలో నాగార్జున సరసన యాక్ట్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. 

సోషల్ మీడియాలో ఈ చిన్నది క్రేజీ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.