National Cinema Day : నేషనల్ సినిమా డే ను పురస్కరించుకుని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI) సినీ ప్రియులకు ఒక శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, మూవీ టైమ్, వేవ్ సహా 4000లకుపైగా మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75కే సినిమాలను ప్రదర్శించనున్నట్టు పేర్కొంది. మొదట సెప్టెంబర్ 16న నేషనల్ సినిమా డేగా జరపాలని ఎంఏఐ ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఆఫర్ డేట్ మారింది. సెప్టెంబర్ 16 బదులు 23కు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చునని ప్రకటించింది. ఇందులో ఉన్న స్టేక్హోల్డర్ల విజ్ఞప్తి మేరకు, మరిన్ని మల్టీప్లెక్స్‌లను భాగం చేసేందుకే ఈ తేదీని వాయిదా వేశామని ఎంఏఐ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయా మల్టీప్లెక్స్ వెబ్‌సైట్లు, అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చునని సూచించింది.
కాగా ఇప్పటికే యూఎస్, యూకేల్లో సెప్టెంబరు 3న సినిమా డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మనదేశంలో కూడా వేడుకగా ఈ సెలబ్రేషన్స్‌ను నిర్వహించేందుకు ఎంఏఐ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే సినీ ప్రియులకు తక్కువ ధరకు మల్టీప్లెక్స్ అనుభూతిని అందించాలని నిర్ణయించుకుంది. ఎంఏఐ పేర్కొన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 75కే నేరుగా సినిమా టికెట్ పొందవచ్చు. ఒక వేళ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్ ధరకు అదనంగా ఇంటర్నెట్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
The National Cinema Day was previously announced to be held on 16th September, however, on request from various stake holders and in order to maximize participation, it would now be held on 23rd September #NationalCinemaDay2022 #Sep23 pic.twitter.com/c5DeDCYaMD
— Multiplex Association Of India (@MAofIndia) September 13, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..