Bigg Boss 5 Telugu: బాలయ్యగా సన్నీ.. గబ్బర్‌ సింగ్‌లా మానస్‌.. సూపర్‌ స్టార్స్ లా మెప్పించిన హౌస్‌మేట్స్‌..

|

Dec 09, 2021 | 3:26 PM

బిగ్‏బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. కేవలం ఆరుగురు మాత్రమే హౌస్‌లో మిగిలిపోగా సింగర్‌ శ్రీరామచంద్ర ఫినాలేకు అర్హత సాధించాడు. షణ్మఖ్‌- సిరిల గొడవ పక్కకు పెడితే బిగ్‌బాస్ ఇంటి సభ్యులందరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు

Bigg Boss 5 Telugu: బాలయ్యగా సన్నీ.. గబ్బర్‌ సింగ్‌లా మానస్‌.. సూపర్‌ స్టార్స్ లా మెప్పించిన హౌస్‌మేట్స్‌..
Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. కేవలం ఆరుగురు మాత్రమే హౌస్‌లో మిగిలిపోగా సింగర్‌ శ్రీరామచంద్ర ఫినాలేకు అర్హత సాధించాడు. షణ్మఖ్‌- సిరిల గొడవ పక్కకు పెడితే బిగ్‌బాస్ ఇంటి సభ్యులందరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. తోటి కంటెస్టెంట్లతో సరదాగా ఆడిపాడుతున్నారు. ముఖ్యంగా రోల్‌ ప్లే టాస్క్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్లను అనుకరించి ఆకట్టుకున్న పోటీదారులు నేటి ఎపిసోడ్‌లో కూడా అలాంటి ఆసక్తికరమైన టాస్క్‌ చ్చాడు. అదే ప్రముఖ సినీతారల రోల్‌ ప్లే గేమ్‌. ఇందులో భాగంగా హౌస్‌ మేట్స్ అందరూ వారికి నచ్చిన సినీతారల్లా వ్యవహరించాల్సి ఉంటుంది. గేమ్‌లో భాగంగా సన్నీ బాలకృష్ణ గెటప్‌ ధరించి ఆకట్టుకున్నాడు. ఆయనలా మాట్లాడడంతో పాటు ‘లక్స్‌ పాప’ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.

అతిలోక సుందరిగా కాజల్‌ శ్రీదేవిని అనుకరించే ప్రయత్నం చేసింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవి డైలాగులు చెప్పి మెప్పించింది. అదేవిధంగా మానస్‌తో కలిసి ‘అబ్బని తియ్యని దెబ్బ’ పాటను రీక్రియేట్‌ చేసింది. ఇక జెనీలియా పాత్ర పోషించిన సిరి..సన్నీతో కలిసి ‘హ్యాపీ’ సినిమాలోని ఓ పాటకు కాలు కదిపింది. ఇక పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ పాత్రలో మానస్‌ అదరగొట్టాడు. అదేవిధంగా ‘తమ్ముడు’ సినిమాలో పవర్‌స్టార్‌ గెటప్‌ను శ్రీరామ్‌ ధరించాడు. పవన్‌ డైలాగులు చెప్పి ఆకట్టుకున్నాడు. ఇక ఇంటి సభ్యులందరూ చిరంజీవి ‘ముఠామేస్త్రి’ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ను సరదాగా స్టెప్పులేసి మెప్పించారు. ఈ ప్రోమో చూస్తుంటే నేటి ఎపిసోడ్‌ ఎంతో ఆహ్లాదకరంగా సాగేలా ఉంది.

Also Read:

Ketika Sharma: కేక పుట్టిస్తున్న రొమాంటిక్ బ్యూటీ.. ట్రెండీ లుక్ లో కేతిక..

బూరె బుగ్గలతో ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. నెట్టింట యామ క్రేజ్..

Akhanda Team Visit Simhachalam Temple: అప్పన్న సన్నిధిలో అఖండ టీమ్.. వీడియో