Beast Review: చిన్న చిన్న సినిమాలు చేసిన దర్శకుడికి విజయ్ (Hero Vijay) లాంటి హీరో పిలిచి అవకాశం ఇవ్వడమంటే సబ్జెక్ట్ లో ఏదో మేటర్ కచ్చితంగా ఉండే ఉంటుందనే మాటలు బీస్ట్ ఓపెనింగ్ టైమ్ నుంచే గట్టిగా వినిపించాయి. ఆ తర్వాత ట్రైలర్ చూసిన వాళ్లు కూడా షాపింగ్ మాల్ హైజాక్ స్టోరీలో హీరో విజయ్ అనే కాన్సెప్ట్ కి ఫిదా అయ్యారు. ఇప్పుడు స్క్రీన్ మీద ఆ మ్యాజిక్ కంటిన్యూ అయిందా..? చదివేయండి..!
సినిమా: బీస్ట్
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లీ, వీటీవీ గణేష్, షాజి చెన్, అపర్ణ దాస్, షూన్ టామ్ చాకో, లిల్లిపుట్ ఫరుకి, అంకుర్ అజిత్ వికాల్ తదితరులు
కెమెరా: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: ఆర్.నిర్మల్
సంగీతం: అనిరుద్
రన్నింగ్ టైమ్: 158 నిమిషాలు
జోనర్: యాక్షన్ కామెడీ
రచన – దర్శకత్వం: నెల్సన్
నిర్మాత: కళానిధిమారన్
విజయ రాఘవ(విజయ్) ఇండియన్ రా ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. తన మిషన్‌లో అమాయకులు బలి కాకూడదన్నది అతని సిద్ధాంతం. అయితే ఒకసారి అతని వల్ల పసిపాప ప్రాణాలు కోల్పోతుంది. దాంతో ఆ ఉద్యోగానికి దూరంగా ఉంటాడు. పసిపాప ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం తానే అని తనలో తాను బాధపడుతుంటాడు. ఆ టైమ్‌లోనే అతనికి ప్రీతి(పూజ) పరిచయమవుతుంది. ఆల్రెడీ ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి నచ్చని అమ్మాయి ప్రీతి. వీజయ రాఘవను చూడగానే ఇష్టపడుతుంది. తను పనిచేస్తున్న సెక్యూరిటీ కంపెనీలోనే ఉద్యోగం ఇప్పిస్తుంది. ఓ మాల్ సెక్యూరిటీ గురించి మాట్లాడటానికి అక్కడికి వెళ్తారు విజయ రాఘవ, ప్రీతి టీమ్. అప్పటికే మాల్ ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. ఉమర్ అనే టెర్రరిస్టును విడుదల చేయమని షరతు విధిస్తారు. ఈ మిషన్‌ని హ్యాండిల్ చేసిన అల్తాఫ్ (సెల్వ రాఘవన్) తీసుకున్న నిర్ణయం ఏంటి? మాల్‌లో ఉన్న తన భార్యా బిడ్డ గురించి హోమ్ మినిస్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఉమర్‌కీ, విజయ రాఘవకి ఉన్న సంబంధం ఏంటి? ప్రీతి లవ్ స్టోరీ సక్సెస్ అయిందా? మధ్యలో మాల్‌లో విజయ రాఘవకి కనెక్ట్ అయిన ఐపీయస్ అమ్మాయి ఎవరు? క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం మాల్ ని డెకరేట్ చేసిన టీమ్‌లో ఉన్న ఇద్దరూ విజయ రాఘవకి ఎలా సాయం చేశారు? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో యాజ్ యూజువల్ విజయ్ ఒన్ మ్యాన్ షోగా రన్ చేశారు మూవీని. హబీబీ పాటకు విజయ్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. యాక్షన్ సీక్వెన్సెస్‌లోనూ నెక్స్ట్ రేంజ్ లో పెర్ఫార్మ్ చేశారు దళపతి. సినిమాలో ఫస్ట్ ఫైట్, క్లైమాక్స్ విజువల్స్, ఫస్ట్ సాంగ్, 30 ఇయర్స్ పృథ్వి కామెడీ, యోగిబాబు కామెడీ సీన్స్, సెక్యూరిటీ ఆఫీసర్ డైలాగులు బావున్నాయి. పూజా, విజయ్ మధ్య లవ్‌స్టోరీ స్టార్టింగ్ కాస్త కన్విన్సింగ్‌గా లేకపోయినా, పూజా లవర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఊపందుకుంది. హైజాక్ అయిన మాల్‌లో, నాలుగు గోడల మధ్య ప్లాన్స్, ఎమోషన్స్, హీరో వేసిన స్కెచ్, మిగిలిన వాళ్ల హెల్ప్… ఇలా అన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. అల్తాఫ్ కేరక్టర్‌లో సెల్వరాఘవ పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడతాయి. విజయ్ సేతుపతి తరహా వ్యక్తులు చేయాల్సిన కేరక్టర్ అది. సెల్వరాఘవకి ఆర్టిస్టుగా మంచి ఫ్యూచర్ ఉంది. కీ సీన్స్ లో అనిరుద్ మ్యూజిక్ హైలైట్ అయింది. మనోజ్ పరమహంస కెమెరా పనితనానికి జనాలు ఫిదా కావాల్సిందే. నెల్సన్ గత సినిమాలను ఇష్టపడినవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.
మాస్టర్ తర్వాత విడుదలైన విజయ్ సినిమా కావడం, విజయ్ ఎలివేషన్ ఇంకో రేంజ్‌లో ఉండటం, షాపింగ్ మాల్‌లో ట్రెమండస్ యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాను మాస్‌లో గట్టిగా ఆడిస్తాయి. ప్రతిదీ హిందీలో చెప్పడం కుదరదు, కావాలంటే నువ్వే తెలుగు నేర్చుకో…వంటి డైలాగులకు థియేటర్లలో క్లాప్స్ పడుతున్నాయి. విజయ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, రా ఏజెంట్ తరహా సినిమాలు కోరుకునేవారికి, యాక్షన్ మూవీస్‌ని ఇష్టపడేవారికి, సిట్చువేషనల్ కామెడీతో సింక్ అయ్యేవారికి తప్పకుండా నచ్చే సినిమా బీస్ట్.
– డా. చల్లా భాగ్యలక్ష్మి.
Also Read: Beast Movie: బీస్ట్ సినిమా చూసినవారికి బంపర్ ఆఫర్.. లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చిన ఫ్యాన్స్..
Beast Twitter Review: విజయ్ బీస్ట్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?
Sanjay Dutt: ఆలియా, రణబీర్ కపూర్ పిల్లల కోసం చూస్తున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సంజయ్ దత్..