
మూవీ రివ్యూ: శంబాలా
నటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, శ్వాసిక విజయ్, మధు నందన్, ఆనంద్, సిజ్జు తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కే బండారి
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యుగంధర్ ముని
నిర్మాతలు: రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి
ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ శంబాలా: ఏ మిస్టికల్ వరల్డ్. సైన్స్ దేవుడికి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా. ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
1980వ దశకంలో శంభాల అనే ఒక ఊరిలో ఆకాశం నుంచి ఒక ఉల్క జారి పడుతుంది. అది పడిన తర్వాత ఆ ఊర్లో వింత అనుభవాలు ఎదురవుతాయి. దాంతో బండ భూతం తమ ఊరిలో పడిందని.. దానివల్ల మనుషులు వరుసగా చనిపోతున్నారు ఊరికి అరిష్టం అని జనాలు భావిస్తుంటారు. అదే ఊరికి సైంటిస్ట్ (ఆది సాయికుమార్) వస్తాడు. అసలేం జరిగింది అని తెలుసుకునే క్రమంలో అతడికి దేవి (అర్చన అయ్యర్) ఎలా సాయం చేసింది..? ఆ ఊరిలో పడిన ఉల్కకు శివుడికి ఏంటి సంబంధం.. అనేది అసలు కథ..
కథనం:
దేవుడు, సైన్స్.. ఈ రెండింటి మధ్య పోరు అంటే ఎప్పుడు ఆసక్తికరమే.. శంబాల సినిమాల కోసం దర్శకుడు యుగంధర్ ముని తీసుకున్నది ఇదే లైన్. సైన్స్ గొప్ప అనే హీరో.. దానికి మించింది ఉంది అని నమ్మే ఊరు జనం.. ఈ రెండు వర్గాల మధ్య జరిగే కథ శంబాల. చాలా ఆసక్తికరంగా సినిమాను మొదలు పెట్టాడు దర్శకుడు యుగంధర్. తొలి పది నిమిషాల్లోనే అసలు కథ చెప్పేసాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి..
ఇంటర్వెల్ వరకు ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్ కథ ఓపెన్ అయిన తర్వాత.. స్క్రీన్ ప్లే మరింత వేగంగా పరుగులు పెట్టింది. మధ్య మధ్యలో సైన్స్ కంటే మించింది మరొకటి ఉంది అని నిరూపించే సన్నివేశాలు సినిమాపై ఆసక్తి మరింత పెంచేస్తాయి. దుష్టశక్తుల ఆవహించిన శరీరం చేసే వింత చేష్టలు.. దాన్ని అరికట్టలేక పాట్లు పడే ఊరు జనం.. వీళ్ళ మధ్యలో హీరో చేసే పోరాటం.. ఎవరికి తెలియకుండా దేవత అందించే సాయం.. ఇలాంటి కొన్ని సన్నివేశాలు శంభాలను మరింత ప్రత్యేకంగా మార్చాయి..
క్లైమాక్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు.. ఏం జరుగుతుందా అనే ఆసక్తికి ఒక మంచి ముగింపు ఇచ్చాడు.
నటీనటులు:
ఆది సాయికుమార్ ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి కం బ్యాక్ సినిమా.. అర్చన అయ్యర్, మధునందన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. శ్వాసిక విజయ్, మధు నందన్, ఆనంద్, సిజ్జు తదితరులు బాగా నటించారు.
టెక్నికల్ టీం:
శ్రీ చరణ్ పాకాల సంగీతం ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ కే బండారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ ఓకే. కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు నిర్మాతలు. దర్శకుడు యుగంధర్ ముని మంచి లైన్ తీసుకున్నాడు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా శంబాల.. ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్..!