Valimai Movie Review: హీరో అజిత్ స్వతహాగా బైక్ రేసులను ఇష్టపడతారు. ఆయనకు నచ్చిన టాపిక్‌ని ఇంక్లూడ్ చేసి హెచ్.వినోద్ డైరక్ట్ చేసిన సినిమా వలిమై. బలం అనే అర్థం వచ్చే టైటిల్ ఇది. ప్యాన్ ఇండియా సినిమా కావడంతో తమిళ టైటిల్‌తోనే తెలుగులోనూ రిలీజ్ చేశారు. మరి తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూద్దాం.
నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ గుమ్మకొండ, హ్యూమా ఖురేషీ, బనీ, సుమిత్ర, రాజ్ అయ్యప్ప, ధ్రువన్, దినేష్ ప్రభాకర్, సెల్వ, అచ్యుత్ కుమార్, సునయన తదితరులు
రచన-దర్శకత్వం: హెచ్. వినోద్
నిర్మాత: బోనీకపూర్
కెమెరా: నిరవ్ షా
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
సంగీతం: గిబ్రన్ (నేపథ్యం), యువన్ శంకర్ రాజా (పాటలు)
నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పీ
విడుదల: ఫిబ్రవరి 24, 2022
చెయిన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు, మాదక ద్రవ్యాల విక్రయాలు, హత్యలు… ఇలా వైజాగ్ సిటీ మొత్తం అల్లకల్లోలమైపోతుంటుంది. మంచి వ్యక్తి దొరికితే అన్నిటికీ ఫుల్‌స్టాప్ పెట్టొచ్చని అనుకుంటారు సిటీ కమిషనర్. సరిగ్గా ఆ సమయంలోనే చార్జ్ తీసుకుంటారు అర్జున్ (అజిత్). అతనికి నార్కోటిక్ ఆఫీసర్ సోఫియా (హ్యూమా) సపోర్ట్ ఉంటుంది. సిటీలో జరిగిన ఓ ఆత్మహత్య ఆధారంగా చాలా విషయాలను కనిపెడతాడు అర్జున్. ఆ క్రమంలో శాటన్ స్లేవ్స్ నాయకుడు నరేన్ గురించి తెలుసుకుంటాడు. అతన్ని అరెస్ట్ చేసి, అంతా ఓ కొలిక్కి వచ్చిందనుకుంటున్న సమయంలో అర్జున్‌కి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? ఉన్నపళాన అర్జున్ ఉద్యోగం నుంచి ఎందుకు సస్పెండ్ అవుతాడు? అతని తల్లి పెట్టే కండిషన్స్ కీ, వృత్తిపరమైన అంశాలకు లింకు ఎందుకు పడింది? సోఫియా వల్ల అతనికి కలిసొచ్చిన అంశాలేంటి? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
యాక్షన్ ప్రియులను అలరించే సబ్జెక్ట్ ఇది. ప్రతి ఫ్రేమ్‌లోనూ నిర్మాతలు పెట్టిన ఖర్చు కనిపిస్తోంది. ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించిన సినిమా. బైక్ రేసింగ్‌లు, యాక్షన్ ఎపిసోడ్‌లు కనురెప్ప వేయనీయనంతగా అట్రాక్ట్ చేస్తాయి. అజిత్ స్వతహాగా బైక్ రైడింగ్‌ను ఇష్టపడటంతో మరింత ప్యాషన్‌తో చేసినట్టు అనిపిస్తుంది. ఆయనకు పోటాపోటీగా నటించారు కార్తికేయ. హ్యూమా ఖురేషికి యాక్షన్ లేడీగా మంచి రోల్ దొరికింది. తల్లిదండ్రుల గొప్పతనాన్ని చెప్పే మాటలు కూడా ఆకట్టుకుంటాయి.
చాలా సందర్భాల్లో సున్నితమైన అంశాలను చాలా బాగా టచ్ చేశారు డైరక్టర్. కథను నడపడానికి హీరోకి ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో గొడవలు వంటివాటిని కలిపారేమో అనిపిస్తుంది. అవి కథాగమనానికి పెద్దగా సహకరించకపోగా, బాగా తెలిసిన కథనే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలిగించాయి. ఎక్కడా అనూహ్యమైన ట్విస్టులు లేకపోవడం, తెలిసిన కథే కావడంతో ఆడియన్స్ బోర్ ఫీలయ్యే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.
కమిషనర్‌లాంటి వ్యక్తి ఒక సాదాసీదా ఆఫీసర్ మీద డిపెండ్ కావడం, హీరో… కథ మొత్తం ఒన్ మ్యాన్ షోగా నడపడం వంటివి పెద్దగా ఆకట్టుకోవు.
యాక్షన్ సినిమాలు కోరుకునే వారికి మాత్రం నచ్చే సినిమా వలిమై.
Also Read..
Son Of India Review: చెడును సహించని సన్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..
DJ Tillu Movie Review: సీను సీనుకీ సీటీ కొట్టించే డీజే టిల్లు