‘మా’లో మళ్ళీ రగడ.. వైస్ ప్రెసిడెంట్ రాజీనామా

|

Apr 16, 2019 | 5:51 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు నెల రోజులు క్రితం శివాజీరాజా, నరేష్ ప్యానల్స్ మధ్య రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. ఇక ఆ పోటీలో మా అధ్యక్షుడిగా నరేష్.. శివాజీరాజా పై 69 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా నరేష్ తో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్‌గా దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి గెలిచారు. ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మళ్లీ ‘మా’లో రగడ మొదలైనట్లు తెలుస్తోంది. […]

మాలో మళ్ళీ రగడ.. వైస్ ప్రెసిడెంట్ రాజీనామా
Follow us on

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు నెల రోజులు క్రితం శివాజీరాజా, నరేష్ ప్యానల్స్ మధ్య రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. ఇక ఆ పోటీలో మా అధ్యక్షుడిగా నరేష్.. శివాజీరాజా పై 69 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా నరేష్ తో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్‌గా దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి గెలిచారు.

ఇది ఇలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మళ్లీ ‘మా’లో రగడ మొదలైనట్లు తెలుస్తోంది. ‘మా’లో నిధులు విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని.. దానితో వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్త పై ఇంతవరకు మా సభ్యులు అధికారకంగా  స్పందించలేదు.