కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక సమస్య నెలకొంది. ఇక ఈ వైరస్ ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద భాగానే తన ప్రభావాన్ని చూపింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని భాషలకు సంబంధించిన సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయి.. సినీ కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసింది ఈ మహమ్మారి. స్టార్ హీరోల కంటే ఒక సినిమా కోసం కష్టపడే చిన్నపాటి కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. దీంతో కొవిడ్ వల్ల ఇబ్బంది పడ్డ సినీ కార్మికులకు సహాయంగా మెగా మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమైంది మాలీవుడ్ చిత్రసీమ. ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షుడు మోహాన్ లాల్ ప్రకటించారు.
మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణంలో ఈ మెగా మల్టీస్టారర్‌ను నిర్మించనున్నారు. ఈ సినిమాకు మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీలో సీనియర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి కీలక పాత్రల్లో కనిపించనుండగా… వీరిద్ధరితోపాటు దాదాపు 140 మంది నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీని రూపొందించనున్నారు. ఈ మెగా మల్టీస్టారర్ నిర్మించడంవలన ఎంతో మందికి పని కల్పించడంతోపాటు.. దీనికి వచ్చిన మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి వినియోగించనున్నట్లుగా సమాచారం.
Also Read: తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం, ఒకే మూవీలో పవర్ స్టార్, సూపర్ స్టార్, ఫ్యాన్స్‌కు పూనకాలే !