Waltair Veerayya: వాల్తేరు వీరయ్య డ్యూయట్ సాంగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న మెగాస్టార్

|

Jan 01, 2023 | 9:05 PM

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య డ్యూయట్ సాంగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న మెగాస్టార్
Chiranjeevi
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న నయా మూవీ వాల్తేరు వీరయ్య. చిరంజీవి ఈ సినిమాలో చాలా కాలాంతర్వత మాస్ గెటప్ లో కనిపి ఆకట్టుకోనున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పిస్తుంటే మరో వైపు రీసెంట్ గా రిలీజ్ అయిన పూనకాలు లోడింగ్ పాట టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమానుంచి ఇప్పుడు నాలుగో సాంగ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి. ఈ పాటకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. సాంగ్ మేకింగ్ వీడియో చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో చిరంజీవి వాయిస్ ఇచ్చారు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని..  ఈ పాటను తులూస్ అనే సిటీలో షూట్ చేశామని అన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటకు అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారని అన్నారు. అలాగే శేఖర్ మాస్టర్ కూడా సూపర్ గా కొరియోగ్రాఫ్ చేశారని తెలిపారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని తెలిపారు మెగాస్టార్. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు. పైగా గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ అవ్వడంతో అంతగా ఫ్యాన్స్ కు ఎక్కలేదు. ఇక ఇప్పుడు ఫుల్ మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..