సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఎంతో అంకితభావంతో పనిచేశారు కాబట్టే తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజిని లిఖించుకున్నారు. స్వయంకృషి అనే పదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఆయన సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. ఈ విషయాన్ని ఆయనతో నటించిన వారెవరైనా చెబుతారు. అలా తాజాగా సినిమాపై ఆయనకున్న నిబద్ధత, కమిట్‌మెంట్ మరోసారి నిరూపితమైంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న హీరోల్లో చిరంజీవి (Chiranjeevi) కూడా ఒకరు. యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది గాక మోహన్‌రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ లో నటిస్తున్నారు. అదేవిధంగా మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్ భోళాశంకర్ షూటింగ్‌ల్లోనూ పాల్గొంటున్నారు. ఇవి కాక కే.ఎస్. రవీంద్ర (K.S. Ravindra), వెంకీ కుడుముల చిత్రాలను కూడా లైన్‌లో పెట్టారు.
షూటింగ్ పూర్తయ్యాకే ప్యాకప్..
కాగా కే.ఎస్. రవీంద్ర డైరెక్షన్‌లో చిరంజీవి నటించనున్న 154వ సినిమాకు వాల్తేరు శ్రీను, వాల్తేరు వీరయ్య.. ఇలా పలు రకాల టైటిల్స్
ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఏనుగుపై సవారీ చేసే సన్నివేశం షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చిరంజీవి కిందకు పడిపోయారట. దీంతో కాలికి గాయం కావడంతో పాటు బెణికిందని సమాచారం. అయినా సరే నొప్పిని తట్టుకుంటూ ఆరోజంతా షూటింగ్‌లో పాల్గొన్నారట మెగాస్టార్. తను షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి వెళ్లిపోతే యూనిట్ మొత్తం డిస్ట్రబ్ అవుతుందని, ఇతర నటీనటుల డేట్లు కూడా వృథా అవుతాయని భావించిన చిరు ఆరోజు తన సన్నివేశాలు పూర్తి చేశాకనే ఇంటికి వెళ్లారట. సినిమా పట్ల చిరంజీవి అంకితభావం, నిబద్ధత చూసి యూనిట్ అంతా ముగ్దులయ్యారట. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ‘ మా మెగాస్టర్ కమిట్‌మెంట్ అంటే అలాగే ఉంటది ‘ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
The day I’m waiting for quite a long time has arrived!! ?
Working with my all time favorite HERO Megastar @KChiruTweets garu for #MEGA154 ❤️
Presenting the ‘Mass Moola Virat’ in an avatar we love to see him the most ?
Annayya Arachakam Arambham ?@MythriOfficial pic.twitter.com/olYEMnglJg— Bobby (@dirbobby) November 6, 2021
కరోనా హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
కరోనా హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక