Waltair Veerayya Twitter Review: కామెడీ, యాక్షన్‌, సెంటిమెంట్‌.. వాల్తేరు వీరయ్య బీభత్సం. ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందంటే.

మెగాస్టార్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే ప్రీమియర్‌షోలు ప్రారంభమయ్యాయి. థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు...

Waltair Veerayya Twitter Review: కామెడీ, యాక్షన్‌, సెంటిమెంట్‌.. వాల్తేరు వీరయ్య బీభత్సం. ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందంటే.
waltair veerayya twitter review

Updated on: Jan 13, 2023 | 7:47 AM

మెగాస్టార్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే ప్రీమియర్‌షోలు ప్రారంభమయ్యాయి. థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. డప్పులు, డ్యాన్సులతో తెల్లవారుజామునుంచే సందడి చేస్తున్నారు. పూనకాలు లోడింగ్‌ అంటూ మెగాఫ్యాన్స్ ముందు నుంచి ఊగిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ధియేటర్ల దగ్గర అదే హంగామా, జోష్‌ కనిపిస్తోంది.

ఏపీ, తెలంగాణలోనే 1200కుపైగా ధియేటర్లలో వాల్తేరు వీరయ్య విడుదలైంది. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్‌ చిరంజీవితోపాటు కనిపించిన మాస్‌మహారాజ రవితేజ కూడా నటించడంతో అటు రవితేజ ఫ్యాన్స్‌ కూడా సినిమాకు క్యూ కడుతున్నారు. థియేటర్లలో సినిమా వీక్షిస్తున్న అభిమానులు ట్విట్టర్‌ వేదికగా మూవీ ఎలా ఉందో చెబుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ వాల్తేరు వీరయ్య గురించి ట్విట్టర్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ట్వీట్స్‌పై ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

ఓ యూజర్ స్పందిస్తూ సంక్రాంతిగ్ విన్న వాల్వేరు వీరయ్య అంటూ ట్వీట్ చేశాడు. కామెడీ టైమింగ్, డ్యాన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు చూశాక వయసు కేవలం ఒక నెంబర్‌ మాత్రమే అనాల్సి వస్తుంది అంటూ రాసుకొచ్చాడు. ఈ లెక్కన సినిమాలో చిరు ఏజ్‌ మరింత తగ్గినట్లు కనిపించినట్లు తెలుస్తోంది.

ఇటలీకి చెందిన మెగా అభిమాని స్పందిస్తూ.. ఇప్పుడే ఇటలీలో వాల్తేరు వీరయ్య సినిమాను చూశాను. వింటేజ్‌ చిరంజీవి మళ్లీ వచ్చేశారు. డీఎస్‌పీ అద్భుతమైన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. చివరిగా రవితేజ అద్భుతం అంటూ రాసుకొచ్చాడు.

బెస్ట్ హీరో ఎంట్రో..

ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్‌ వాల్వేరు వీరయ్యే అంటూ మరో అభిమాని ట్వీట్‌ చేశాడు. సముద్రం మధ్యలో పడవలో చిరు ఎంట్రీ సీన్‌ని డిజైన్‌ చేశారు. వర్షం కురుస్తుండగా, చిరు బీడీ ముట్టిస్తున్న సీన్‌ కేక పుట్టిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..