Ram Charan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగా పవర్‌ స్టార్‌.. చెర్రీ చేసిన పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌.

తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. నటన పరంగా ప్రశంసలు అందుకుంటూనే మరోవైపు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో తండ్రి చిరంజీవి..

Ram Charan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగా పవర్‌ స్టార్‌.. చెర్రీ చేసిన పనికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌.
Ram Charan

Updated on: Feb 09, 2023 | 7:46 PM

తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. నటన పరంగా ప్రశంసలు అందుకుంటూనే మరోవైపు సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో తండ్రి చిరంజీవి బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా అభిమానుల విషయంలో ఎప్పుడూ ముందుండే చెర్రీ తాజాగా అభిమానిని కలిసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఓ చిన్నారిని నేరుగా వెళ్లి కలిశారు రామ్‌ చరణ్‌.

వివరాల్లోకి వెళితే మణి కౌశల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆ కుర్రాడికి రామ్‌ చరణ్‌ను కలవాలని ఆశపడ్డాడు. ఈ విషయాన్ని మేక్‌ ఏ విష్‌ అనే కార్యక్రమం ద్వారా రామ్‌ తెలుసుకున్నారు. వెంటనే చిన్నారి అభిమాని కోరికను తీర్చేందుకు నేరుగా రంగంలోకి దిగారు. క్యాన్సర్‌పై చిన్నారి చేస్తున్న పోరాటంలో కొండం బలం ఇచ్చారు. కాసేపు ఆ పిల్లాడితో ముచ్చటించి సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కుర్రాడికి బహుమతిని కూడా ఇచ్చారు రామ్‌ చరణ్‌.

 

రామ్‌ చరణ్‌ చేసిన ఈ పనికి ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అభిమానుల విషయంలో చెర్రీ ఎప్పుడూ ముందుంటారని దటీజ్‌ మెగా పవర్‌ స్టార్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక రామ్‌ చరణ్‌ కెరీర్‌ విషయానికొస్తే ప్రస్తుతం చెర్రీ.. శంకర్‌ దర్శకత్వంలో సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరగుతోంది. ఇదిలా ఉంటే ట్రిపులార్‌ చిత్రంతో చెర్రీ ఒక్కసారిగా అంతర్జాతీయంగా ఫేమ్‌ సంపాదించుకున్న విషయం విధితమే. ట్రిపులార్‌ ఆస్కార్‌ బరిలో నిలవడం, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించడంతో చెర్రీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..