Pawan Kalyan Assets : పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎంతో తెలిస్తే షాకవుతారు..! ఇన్నేళ్ళలో ఎంత వెనకేసారు అంటే..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ పవన్‌కల్యాణ్. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ మాత్రం పెరుగుతూనే ఉంది. చిరు తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై, పవర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థాయి ఏర్పాటు చేసుకున్నారు పవన్ కల్యాణ్.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ పవన్‌కల్యాణ్. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ మాత్రం పెరుగుతూనే ఉంది. చిరు తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై, పవర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థాయి ఏర్పాటు చేసుకున్నారు పవన్ కల్యాణ్. ఆయన సినిమాలు విభిన్నం.. ఆయన స్టైల్ అంతకు మించి. ఇక పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పేది ఏముంది. సాయం అంటే చాలు ఎగబడి ముందుకు వచ్చేస్తారు. ఎంతోమందికి గుప్త దానాలు చేశారు. అలాంటి పవన్ దేశ సేవకోసం జనసేన పార్టీ స్థాపించి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్న పవన్ ఒక్క సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ 50 నుంచి 60 కోట్ల మధ్య ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరి ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్.. ఆస్తుల విలువ ఎంత ఉంటుందన్నది చాలామంది డౌట్. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. పవన్‌కు ఆస్తులకన్నా అప్పులే ఎక్కువగా ఉన్నాయంటూ బాంబ్ పేల్చారు. పవన్ కార్లు, ఇల్లు కూడా లోన్‌పై తీసుకున్నవే అని చెప్పుకొచ్చారు. పవన్‌సొంతమని చెప్ఉకోడానికి ఉన్న ఏకైక ఆస్తి శంకర్ పల్లి వద్ద ఉన్న 8 ఎకరాల పొలమేనని తెలిపారు. పవన్‌కు వ్యవసాయం చేయడమంటే ఎంతో ఇష్టమని అందుకోసమే.. చాలా ఏళ్ల క్రితం 8 ఎకరాలను కొనుగోలు చేశారని వివరించారు. పవన్ కొన్నప్పుడు ఆ భూమి 10 లక్షలు ఖరీదని చెప్పారు. పవన్ గతంలో తాను సంపాదించిన డబ్బును సేవా కార్యక్రమాల కోసం వెచ్చించేవాడని.. ఇప్పుడు పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాడని నాగబాబు తెలిపారు. జానీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు.. తన రెమ్యూనరేషన్‌తో పాటు అదనంగా మరికొంత డబ్బును ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేశాడని చెప్పుకొచ్చారు. 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఇచ్చేయడానికి రెడీ అయితే తానే బలంవంతంగా ఆపానని నాగబాబు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

