AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narasimha : నరసింహ సినిమాలో సౌందర్య పాత్ర రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో అత్యంత ఐకానిక్ మరియు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో 'నరసింహా'. (తమిళంలో 'పడయప్ప' - Padayappa) ఒకటి. దర్శకుడు కె.యస్. రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 1999లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించి, రజినీకాంత్ స్టైల్ అండ్ మాస్ ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది.

Narasimha : నరసింహ సినిమాలో సౌందర్య పాత్ర రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరంటే..
Narasimha
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2026 | 8:17 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ మీనా తన సినీ కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా కొన్ని కీలక చిత్రాలలో నటించే అవకాశాలను ఎందుకు కోల్పోయిందో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో బిజీగా ఉన్నప్పటికీ, తెలుగు చిత్రసీమ తనకు ఎంతో గుర్తింపునిచ్చిందని, ఇక్కడ క్వీన్ లా ట్రీట్ చేశారని ఆమె పేర్కొన్నారు. తెలుగులో సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో వచ్చిన విజయమే తన కెరీర్‌లో పెద్ద బ్రేక్ అని, ఆ తర్వాత తమిళంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. రజనీకాంత్ యజమాన్ వంటి చిత్రాలు, ప్రభు వందవ సినిమా, ఏవీఎం వారి 150వ చిత్రం వంటి ప్రత్యేకమైన సినిమాలను మాత్రమే ఎంచుకున్నానని వివరించారు.

అయితే, తన కెరీర్‌లో కొన్ని పెద్ద హిట్‌లు అయిన సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని, వాటిలో కొన్నింటి గురించి ఇప్పటికీ బాధపడుతుంటానని మీనా వెల్లడించారు. నిన్నే పెళ్లాడతా చిత్రం అలాంటి వాటిలో ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 60 నుండి 65 రోజుల డేట్లు అడిగారని, అయితే అప్పటికే ఇతర కమిట్‌మెంట్స్ ఉండడంతో అన్ని రోజులు కేటాయించలేకపోయానని మీనా పేర్కొన్నారు. అప్పట్లో 25 రోజుల్లో సినిమాలు పూర్తి చేసే సమయంలో 60 రోజులు అడగడంతో ఆశ్చర్యపోయానని, అప్పటి కమిట్‌మెంట్స్ వల్ల అంగీకరించలేకపోయానని తెలిపారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించిన తర్వాత మంచి పాత్రను కోల్పోయానని ఆమె అంగీకరించారు.

ఇదేవిధంగా, రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ చిత్రం నరసింహ (తమిళంలో పడయప్ప) లో సౌందర్య పోషించిన రమ్యకృష్ణ పాత్రను కూడా మీనా తిరస్కరించారు. ఈ పాత్రకు తన తల్లి వ్యతిరేకించారని, నెగటివ్ షేడ్స్ ఉన్న పొగరుబోతు క్యారెక్టర్ తన హోమ్లీ ఇమేజ్‌కి సరిపోదని సలహా ఇచ్చారని మీనా వివరించారు. అప్పట్లో రజనీకాంత్ – మీనా కాంబినేషన్ చాలా పాపులర్ అని, తమిళ్‌నాడులో వారికి మంచి పేరుందని ఆమె గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ గారు, దర్శకుడు కూడా మీనా తల్లి చెప్పిన తర్వాత ఆ పాత్ర సరిగా ఉండదేమో అని ఆలోచించడం మొదలుపెట్టారని చెప్పారు. అప్పుడు వారు సౌందర్య పాత్రను చేయమని అడిగితే, తాను చేయలేదని, కేవలం ఆ రమ్యకృష్ణ పాత్ర అయితేనే చేస్తానని, లేదంటే చేయనని చెప్పడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, తాను ఆ పాత్రను చేయకపోవడం వల్లే అది మరింత బలంగా, అద్భుతంగా మారిందని దర్శకుడు తనతో చెప్పినట్లు మీనా వెల్లడించారు.

ఇంకా, కమల్ హాసన్‌తో చేయాల్సిన దేవర్ మగన్ (తెలుగులో క్షత్రియ పుత్రుడు) చిత్రాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని మీనా ప్రస్తావించారు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి వచ్చానని, అయితే కమల్ హాసన్‌కు తన గెటప్ సరిగా రాలేదని సంతృప్తి చెందకపోవడంతో మొదటి షెడ్యూల్ రద్దు అయ్యిందని తెలిపారు. మళ్లీ రీషూట్ చేసినప్పటికీ, దర్శకుడికి, టీమ్‌కి మధ్య కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్స్ రావడంతో మరో షెడ్యూల్ రద్దు అయ్యిందన్నారు. మూడోసారి అడిగినప్పుడు తన వద్ద డేట్స్ లేకపోవడంతో ఆ చిత్రాన్ని చేయలేకపోయానని వివరించారు. ఇలా తన కెరీర్‌లో కొన్ని ఐకానిక్ పాత్రలను కోల్పోవాల్సి వచ్చిందని మీనా వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?

మీనా.. 

Meena

Meena

ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..

Follow Us
నరసింహ సినిమాలో సౌందర్య రూల్.. అందుకే నో చెప్పా..
నరసింహ సినిమాలో సౌందర్య రూల్.. అందుకే నో చెప్పా..
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.
బడ్జెట్‌లో Acerpura Nitro.. ఫీచర్లు ఇవే
బడ్జెట్‌లో Acerpura Nitro.. ఫీచర్లు ఇవే
చిప్‌సెట్, డిస్‌ప్లేలతో యాపిల్ ఐప్యాడ్‌ మిని8.. మార్పులివే
చిప్‌సెట్, డిస్‌ప్లేలతో యాపిల్ ఐప్యాడ్‌ మిని8.. మార్పులివే
దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే
దుర్గాదేవి బొట్టు కింద చిన్న సాలీడు.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే
యూజర్లకు Airtel అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్
యూజర్లకు Airtel అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్