Tollywood : సోషల్ మీడియా నాకు నచ్చలేదు.. అందుకే దూరంగా ఉంటున్నా.. టాలీవుడ్ హీరోయిన్..
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే కొందరు సినీతారలు సమాజంలో జరిగే విషయాలపై తమదైన స్టైల్లో స్పందిస్తుంటారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఆమె ఎవరంటే..

సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎడిట్‌ల దుర్వినియోగం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కొందరు ఆకతాయిలు ఏఐ ఉపయోగించి సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికి విసిగిపోయిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌ను వదిలేశారు. తన ఫోటోలను దుర్వినియోగం చేస్తుండటాన్ని చూసిన తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్భాల్లో వెల్లడించారు. యాజమాన్య బృందం నుండి వ్యతిరేకత ఎదురైనప్పటికీ, ఆమె ఏడాదికి పైగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఇన్ స్టా డీయాక్టివేట్ చేయడంపై తాజాగా ఐశ్వర్య లక్ష్మి స్పందించారు. తన ఫోటోలు, వీడియోలు, చిత్రాలను ఏఐ ఉపయోగించిన తీరు తనకు ఎప్పుడూ నచ్చలేదని ఆమె స్పష్టం చేసింది.
ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..
అలాంటి అసభ్యకరమైన మార్పులను తన కళ్లతో చూడలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పింది. సమాజంలో ఇది ఇప్పటికీ జరుగుతూ ఉండవచ్చని, కానీ దానికి దూరంగా ఉండటం ద్వారా తాను మనశ్శాంతిని పొందానని ఆమె పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉండటం వల్ల కొందరికి బ్రాండ్ డీల్స్ కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, అది ఒక నటిగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచిదని అన్నారు. తన కెరీర్ సరిగ్గా సాగకపోయినా, అంతా బాగానే ఉందని నకిలీ పోస్టులు పెట్టాలనే ఒత్తిడి నుండి ఆమె ఇప్పుడు విముక్తి పొందింది. ఇతరుల్లాగా సోషల్ మీడియాలో నటించడం తనకు ఇష్టం లేదని, ప్రస్తుతానికి తిరిగి వచ్చే ప్రణాళికలు కూడా లేవని ఆమె చెప్పింది.
ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?
ఐశ్వర్య లక్ష్మి ఇటీవల బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన తమిళ వెబ్ సిరీస్ #లవ్ లో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ సిరీస్‌లో ఆమె తార పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సౌందర్య రజనీకాంత్ నిర్మించిన ఈ సిరీస్ ద్వారా ఆమె ఓటీటీ , లాంగ్ ఫార్మాట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఐశ్వర్య లక్ష్మీ..

Aishwarya Lekshmi Telugu
ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..
