AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలెర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఒకవైపు నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చివరి దశకు చేరుకోగా, మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలతో పాటు గంటకు 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది.

Weather Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలెర్ట్..
Ap Weather Forecast
Krishna S
|

Updated on: Oct 12, 2026 | 6:45 PM

Share

దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ చురుగ్గా సాగుతుండగా, రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు మొదలయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.

ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఎల్లుండి రాయలసీమలోని కొన్ని చోట్ల, కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రాగల మూడు రోజుల పాటు తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా ఉపసంహరించుకున్నాయని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి గాలుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్