AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: స్మశానంలో పుట్టినరోజు చేసుకున్న హీరోయిన్.. కారణం ఏమని చెప్పిందంటే..

కానీ ఓ హీరోయిన్ మాత్రం తన పుట్టిన రోజు వేడుకలను విభిన్నంగా స్మశానంలో జరుపుకుంది. అందుకు తగిన కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది.

Viral: స్మశానంలో పుట్టినరోజు చేసుకున్న హీరోయిన్.. కారణం ఏమని చెప్పిందంటే..
Arya
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2022 | 7:33 PM

Share

ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు చాలా స్పెషల్. ఈరోజును ఎంతో సంతోషంగా అందంగా జరుపుకుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి బర్త్ డే సెలబ్రెషన్స్ చేసుకుంటారు. జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బర్త్ డే రోజున మర్చిపోయి సంతోషంగా.. ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ఇక మరికొందరు తమ ఫ్యామిలీ మెంబర్స్‏తో.. ఫ్రెండ్స్‏తో కలిసి సరదాగా రెస్టారెంట్స్, లేదా ట్రిప్ కు వెళ్లాలనుకుంటారు. ఇక సెలబ్రెటీలు జరుపుకునే బర్త్ డే సెలబ్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫైవ్ స్టార్ హోటల్స్, పబ్స్ లలో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం తన పుట్టిన రోజు వేడుకలను విభిన్నంగా స్మశానంలో జరుపుకుంది. అందుకు తగిన కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. (arya ghare)

హిందీ, మరాఠీ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి ఆర్యా ఘారే. డ్యూల్ బంద్, భిర్గీత్, అబా, బ్యాక్ టూ స్కూల్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే మంగళవారం ఆమె పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి స్మశానంలో బర్త్ డే సెలబ్రెషన్స్ చేసుకుంది. పుణెలోని పింప్రి చించ్ వడ్ లోని ఓ స్మశాన వాటికలో ఆమె తల్లితోపాటు కొందరు డైరెక్టర్స్, నిర్మాతల మధ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. మూఢనమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఆమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా పర్వావరణ పరిరక్షణ స్పూర్తితో స్మశానవాటికలో చెట్లు పంపిణి చేశారు. ప్రస్తుతం ఆమె బర్త్ డే సెలబ్రెషన్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.