Ponniyin Selvan Movie: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. పోస్టర్స్‌లో మహారాణుల్లా మెరిసిన ఐశ్వర్య, త్రిష..

|

Mar 02, 2022 | 9:21 PM

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’  (Ponniyin Selvan). విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Ponniyin Selvan Movie: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. పోస్టర్స్‌లో మహారాణుల్లా మెరిసిన ఐశ్వర్య, త్రిష..
Ponniyin Selvan Movie
Follow us on

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’  (Ponniyin Selvan). విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మద్రాస్​ టాకీస్​తో కలిసి లైకా ప్రొడక్షన్స్ అత్యంత​భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్‌ డ్రామాను నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఈ ఏడాది సెప్టెంబర్​ 30న ‘పొన్నియన్​ సెల్వన్’​ పార్ట్​ 1ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో పాటు ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai)​, త్రిష (Trisha), విక్రమ్ (vikram)​, జయం రవి, కార్తీ ఫస్ట్​లుక్​లను కూడా రిలీజ్​ చేశారు మూవీ మేకర్స్‌. ఈ పోస్టర్​లలో ఐశ్వర్య రాయ్​, త్రిష మహారాణుల్లాగా కనిపించగా విక్రమ్​, జయం రవి యుద్ధ వీరుల్లాగా దర్శనమిచ్చారు. ఇక కార్తీ మరింత విభిన్నమైన లుక్​లో అలరించాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా విడుదల కానుంది. ఆస్కార్ గ్రహీత ఏఆర్​ రెహమాన్​ సంగీతం అందిస్తున్నారు. కెమెరా మెన్‌గా ర‌వి వ‌ర్మన్‌, ఎడిట‌ర్‌గా శ్రీక‌ర్ ప్రసాద్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా 2018లో మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ‘చెక్కం చివ్వంద వాన‌మ్ (తెలుగులో న‌వాబ్స్‌)’ విడుద‌లైంది. అప్పటి నుంచి తన డ్రీమ్‌ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టి సారించారు. మధ్యలో కొన్ని వెబ్‌సిరీస్‌లూ కూడా తెరకెక్కించారు. అయితే పూర్తి స్థాయి సినిమాను మాత్రం రూపొందించలేదు. మ‌రి మ‌ణిర‌త్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోన్న ‘పొన్నియిన్ సెల్వన్‌’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో లెట్స్‌ వెయిట్ అండ్‌ సీ..

Also Read:Russia Ukraine War: ఖార్కివ్‌ నగరంలో భారతీయుల పరుగులు.. వివరణ ఇచ్చిన విదేశాంగ మంత్రిత్వ శాఖ

Andhra Pradesh: శైవ పుత్రులు.. శివుని అంశగా భావిస్తారు.. ఎలుగుబంటి చర్మాన్ని కప్పుకుని

Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కుట్రను భగ్నం చేసిన పోలీసులు..