Nakshathra: అర్థరాత్రిలో అందరు నిద్రపోయాక బస్సులో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. ముఖ్యమంత్రులను ట్యాగ్ చేసిన బుల్లితెర నటి..

|

Aug 21, 2022 | 8:53 AM

తాజాగా బుల్లితెర సీరియల్ నటి సోదరిపై ఓ బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న ఆమె పట్ల అందరు నిద్రపోయాకా అసభ్యంకగా తాకాడు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ రెండు రాష్ట్రాల

Nakshathra: అర్థరాత్రిలో అందరు నిద్రపోయాక బస్సులో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. ముఖ్యమంత్రులను ట్యాగ్ చేసిన బుల్లితెర నటి..
Nakshatra
Follow us on

ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు మాత్రం తగ్గడం లేదు. ఒంటరిగా బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి చేరుకునేవరకు ప్రతి తల్లిదండ్రులు భయంతో గడపుతుంటారు. కేవలం రాత్రిళ్లు మాత్రమే కాకుండా పగలు కూడా మహిళలకు రక్షణ లేదు. తాజాగా బుల్లితెర సీరియల్ నటి సోదరిపై ఓ బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న ఆమె పట్ల అందరు నిద్రపోయాకా అసభ్యంకగా తాకాడు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్యాగ్ చేసింది. వివరాల్లోకెలితే.. మలయాళ బుల్లితెరపై పలు సీరియల్లలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి నక్షత్ర. వల్లి తిరుమనం, యారది నీ మోహని వంటి సీరియల్స్ ద్వారా టెలివిజన్ ఆడియన్స్ కు చేరువయ్యింది. ఇటీవల ఆమె సోదరి చెన్నై నుంచి కేరళలోని తమ స్వస్థలం అలువా వెళ్లేందుకు ఓ ప్రైవేటు బస్సు ఎక్కింది.

అయితే అర్థరాత్రి ప్రయాణికులు అందరు నిద్రలోకి జారుకున్న తర్వాత బస్సులో ఉన్న రెండో డ్రైవర్ ఆమెను అసభ్యంగా తాకాడు. వెంటనే తేరుకున్న ఆమె ఏం చేస్తున్నావని నిలదీయగా.. పొరపాటున చేయి తగిలిందంటూ తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అతను కావాలనే అలా ప్రవర్తించాడంటూ మిగతా ప్రయాణికులకు నక్షత్ర సొదరి చెప్పడంతో తమతోనూ అలాగే ప్రవర్తించాడంటూ వాళ్లు ఆరోపించారు. ఇక విషయం తెలుసుకున్న నక్షత్ర తన చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆ డ్రైవర్ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయ్ విజయన్ లను ట్యాగ్ చేసింది. రెండు రాష్ట్రాల పోలీసులు సదరు డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నక్షత్రకు మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి పట్ల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.