సినిమా షూటింగ్ జరుగుతుండగానే కుప్పకూలిన డైరెక్టర్.. ఫేస్‏బుక్ ద్వారా అసలు విషయాన్ని తెలిపిన చిత్రయూనిట్..

|

Dec 23, 2020 | 6:05 PM

సినిమా షూటింగ్ జరుగుతుండగానే దర్శకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన బుధవారం ఉదయం కోయంబత్తూరులో జరిగింది. మలయాళం డైరెక్టర్ నారాణిపుజ షాన్‏వాస్ చిత్రీకరిస్తున్న

సినిమా షూటింగ్ జరుగుతుండగానే కుప్పకూలిన డైరెక్టర్.. ఫేస్‏బుక్ ద్వారా  అసలు విషయాన్ని తెలిపిన చిత్రయూనిట్..
Follow us on

సినిమా షూటింగ్ జరుగుతుండగానే దర్శకుడు కుప్పకూలిపోయాడు. ఈ ఘటన బుధవారం ఉదయం కోయంబత్తూరులో జరిగింది. మలయాళం డైరెక్టర్ నారాణిపుజ షాన్‏వాస్ చిత్రీకరిస్తున్న గాంధీరాజన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన ఆకస్మాత్తుగా కిందపడిపోయారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఆయనను బ్రెయిన్ డెడ్‏గా తెలిపారు. ప్రస్తుతం ఆ డైరెక్టర్‏ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

పాలక్కాడ్ జిల్లాలోని అట్టపాడి సమీపంలో గాంధీరాజన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుధవారం ఉదయం అందరు షూటింగ్ స్పాట్‏కు చేరుకున్నారు. షూటింగ్ కోసం టేక్ తీసుకునే సమయంలో దర్శకుడు షానవాస్ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‏లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను పరిశీలించి బ్రెయిన్ డెడ్‏గా తెలిపారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత విజయ్ బాబు తన ఫేస్‏బుక్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆయన బ్రతకాలని ఆ దేవుడిని ప్రార్థించాలని నిర్మాత కోరారు. కాగా 2015రలో కైరై సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి వచ్చిన షానవాస్.. అదితిరావ్ హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటించిన సూఫియం సుజాతాయం అనే సినిమాకు దర్శకత్వం వహించారు.