P Balachandran Died: ప్రముఖ మలయాళ నటుడు పి. బాలచంద్రన్ అనారోగ్యంతో మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు

|

Apr 05, 2021 | 10:19 AM

ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ 62 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ సోమవారం తెల్లవారుజామున మరణించారు. బాలచంద్రన్ కు...

P Balachandran Died: ప్రముఖ మలయాళ నటుడు పి. బాలచంద్రన్ అనారోగ్యంతో మృతి..  సంతాపం తెలిపిన ప్రముఖులు
P Balachandran
Follow us on

P Balachandran Died: ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ 62 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ సోమవారం తెల్లవారుజామున మరణించారు. బాలచంద్రన్ కు భార్య శ్రీలత, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, పార్వతి ఉన్నారు.

కేరళలోని కొల్లం జిల్లాలోని శాస్తంకోట గ్రామంలో పద్మనాభ పిళ్ళై, సరస్వతి భాయ్ దంపతులకు పద్మనాభన్ బాలచంద్రన్ నాయర్ ఫిబ్రవరి 2, 1952 న జన్మించారు. స్క్రీన్ రైటర్ గా, నటుడుగా పనులు సినిమాలకు పనిచేశారు. నటుడుగా వెండితెరపై అడుగు పెట్టకముందు ముందు మహాత్మ గాంధీ యూనివర్సిటీలో టీజర్‌గా పనిచేసారు.

థియేట్రికల్ ఆర్ట్స్ లో నటనలో శిక్షణ తీసుకున్న బాలచంద్రన్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతోొ స్క్రీన్ రైటర్‌గా వెండి తెరకు పరిచయం అయ్యారు. త్రివేండ్రం లాడ్జ్, థాంక్యూ, సైలెన్స్ వంటి సినిమాల్లో నటించారు.
అంకుల్ బన్, కల్లు కొండోరు పెన్నూ, పోలీస్ తదితర స్క్రిప్ట్స్ రాశాడు. కవి టి పి. కున్హిరామన్ నాయర్ జీవితం ఆధారంగా 2012 లో తెరకెక్కిన ఇవాన్ మేఘరూపన్ కు దర్శకత్వం వహించారు.

బాలచంద్రన్ కళా రంగానికి చేసిన సేవకు గాను కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్నారు. 1989లో వేసిన ‘పావన్ ఉస్మాన్’ నాటకానికి అవార్డులతో పాటు.. అనేక ప్రశంసలను అందుకున్నారు.

బాలచంద్రన్ చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో మమ్ముట్టి చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ వన్ లో కనిపించారు . బాలచంద్రన్ మృతికి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పరిశ్రమలోని అభిమానులు, సహచరులు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.

Also Read: ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్డు.. ఈ గుడ్డు 15 మంది వరకూ ఫుడ్డు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా..!

 జుట్టు రాలిపోతుందా..! ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి.. ఒత్తైన అందమైన జుట్టు మీ సొంతం