Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు పదుల వయస్సులోను చాలా స్మార్ట్‌గా, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రోజురోజుకు మహేష్ వయస్సు పెరగడం కాదు తగ్గుతుందని ఆయనని చూసిన వారే చెబుతారు. తాజాగా మహేష్ ఫిట్‌నెస్ ట్రైనర్ మహేష్‌పై ప్రశంసలు జల్లు కురిపించాడు. సర్కారు వారి పాట కోసం మహేష్ బాబు దుబాయ్ వచ్చి 30 రోజులు అయింది. ఇక్కడ కూడా కఠినమైన వర్కవుట్స్, డైటింగ్ చేస్తూ తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటున్నాడు.
సెట్స్ లో ఎంత శ్రమించినా కూడా వర్కవుట్స్ విషయంలో మహేష్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. 2019 నుంచి అతనికి ట్రైనర్‌గా ఉన్నాను. గాయాలతో బాధపడ్డప్పటికీ, కోలుకున్న తర్వాత ఆయన ఫిట్‌గా మారే తీరు అద్భుతం. అందరి వయస్సు పెరుగుతున్నప్పటికీ, మహేష్ వయస్సు మాత్రం తగ్గుతుంది అని ట్రైనర్ మినాష్ గబ్రిఏల్ పేర్కొన్నాడు. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని పరశురాం తెరకెక్కిస్తుండగా, ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Top 5 Android 12 Features : ఆండ్రాయిడ్ 12లో టాప్-5 ఫీచర్స్.. ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..