పవన్, ఎన్టీఆర్, చరణ్‌లను వెనక్కు నెట్టిన సూపర్ స్టార్.. ఈ ఏడాది టాప్‌లో మహేష్..
2020 ముగింపుకు ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉన్నాయి. కరోనా సంక్షోభంతో దేశం మొత్తం లాక్డౌన్ విధించడంతో చాలా మంది టీవీలకు, ల్యాప్‌ట్యాప్‌లకు, మొబైల్ వాడకం తెగ పెంచేశారు.
2020 ముగింపుకు ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉన్నాయి. కరోనా సంక్షోభంతో దేశం మొత్తం లాక్డౌన్ విధించడంతో చాలా మంది టీవీలకు, ల్యాప్‌ట్యాప్‌లకు, మొబైల్ వాడకం తెగ పెంచేశారు. ప్రతీ సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వివరాలను ట్విట్టర్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2020లో ఎక్కువ మంది ట్వీట్ చేయబడిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ వీరే అంటూ టాప్ 10 స్టార్స్ జాబితాను ట్విట్టర్ ఇండియా షేర్ చేసింది.
సౌత్ ఇండియా సినిమా ట్వీట్టర్ స్టార్స్‌లో సూపర్ స్టార్ మహేష్ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేష్, ప్రతీ సందర్బానికి తగినట్లుగా ట్వీట్టర్ వేదికగా స్పందించడం ఈ సూపర్ స్టార్‌కి అలవాటు. అయితే మహేశ్ తర్వాత రెండవ స్థానంలో జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచాడు. పవన్ కొత్తగా నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ కోసం చాలా మంది సెర్చ్ చేశారట. అంతేకాకుండా అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా పవన్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉండడంతో అతని పేరు బాగా ట్రెండ్ అయ్యిందట. ఆ తర్వాతి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఓ ఫేక్ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై అతని ఫ్యాన్ ట్విట్టర్ వేదికగా తెగ హడావిడి చేశారు.
ఆ తర్వాతీ స్థానాలలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమా అప్డేట్స్ కోసం, ఎన్టీఆర్ కోసం చాలా మంది ఫ్యాన్స్ సెర్చ్ చేసారట. కాగా ఇటీవల విడుదలైన ఆకాశం నీ హద్దురా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ హిట్‌తో సూర్య ట్విట్టర్లో తెగ ట్రెండ్ అయ్యారు. ఈ ఏడాది వచ్చిన అలవైకుంఠపురం బాక్సాఫీసు ముందు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్‌తో ఈ ఏడాది ట్విట్టర్లో 6వ స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. తర్వాత రాంచరణ్ 7వ స్థానంలో, కోలీవుడ్ స్టార్ కాక ధనుష్ 8 స్థానంలో నిలవగా, ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ 9వ నిలిచారు. ఇక ఈ మధ్యనే ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ 10వ స్థానంలో నిలిచారు.