
సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. అందులో బిజినెస్ మ్యాన్‌గా, సాధారణ వ్యక్తిగా రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు మహేశ్. ‘‘సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్ ఉండవు, కామాలు మాత్రమే ఉంటాయి’’.. ‘‘సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ’’.. ‘‘నాకో ప్రాబ్లమ్ ఉంది సర్.. ఎవడైనా నువ్వు ఓడిపోతావు అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు’’ అంటూ టీజర్‌లో వచ్చిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. అలాగే టీజర్‌కు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ అదిరిపోయింది. మొత్తానికి టీజర్‌తో అంచనాలను అమాంతం పెంచేశాడు ‘మహర్షి’.
కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ 25వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రంపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.