MaheshBabu: 50 ఏళ్ల వయసులో 25 లుక్స్.. మహేష్‌ ఫిట్‌నెస్ సీక్రెట్ లీక్ చేసిన కోచ్

టాలీవుడ్​ సూపర్‌స్టార్ మహేష్ బాబు, 50 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా కనిపించగలుగుతున్నారు? నేటి యువతను వెంటాడుతున్న మిలియన్​ డాలర్​ ప్రశ్న ఇది. మహేష్​ ఎక్కడ కనిపించినా లుక్స్​ గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ‘వారణాసి’ మూవీ గ్లింప్స్​ ..

MaheshBabu: 50 ఏళ్ల వయసులో 25 లుక్స్.. మహేష్‌ ఫిట్‌నెస్ సీక్రెట్ లీక్ చేసిన కోచ్
Maheshbabu

Updated on: Nov 18, 2025 | 8:01 PM

టాలీవుడ్​ సూపర్‌స్టార్ మహేష్ బాబు, 50 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా కనిపించగలుగుతున్నారు? నేటి యువతను వెంటాడుతున్న మిలియన్​ డాలర్​ ప్రశ్న ఇది. మహేష్​ ఎక్కడ కనిపించినా లుక్స్​ గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ‘వారణాసి’ మూవీ గ్లింప్స్​ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మహేష్​ లుక్, స్మైల్, యూత్‌ఫుల్ గ్లో చూసి ఫ్యాన్స్ మరోసారి షాక్ అయ్యారు.

SS రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్, ప్రియాంక చోప్రా జోనాస్ (మందాకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ)లతో పాటు మహేష్ రుద్ర రోల్‌లో కనిపించబోతున్నారు. అయితే మహేష్​ లుక్​కి అందరూ ఫిదా అయిపోయారు. ఇంతకీ మహేష్​ లుక్​ వెనక రహస్యం ఏంటి?

అసలు రహస్యం అదే..

మహేష్​ లుక్​ వెనకాల రహస్యాన్ని ఆయన ఫిట్‌నెస్ కోచ్ కుమార్ మన్నావా ఫిజిక్ ఎలైట్ మాస్టర్ ట్రైనర్ పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మహేష్ 365 రోజులు వర్కౌట్ చేస్తారు, రోల్స్ కోసం కాదు, శరీరాన్ని ఫిట్​గా ఉంచుకోవడం కోసం.

చాలామంది స్టార్స్ సినిమాల కోసం మాత్రమే హార్డ్ ట్రైనింగ్ చేస్తారు, కానీ మహేష్ ఒక్కరోజు కూడా మిస్​ చేయకుండా వర్కౌట్స్​ చేస్తారని చెప్పుకొచ్చారు కుమార్. అంతేకాదు, మహేష్​ స్మార్ట్​ లుక్​కి కారణం అతని హైట్​ కూడా. 6’1″ హైట్, లాంగ్ లిమ్బ్స్ కారణంగా మసిల్ గెయిన్ చాలా చాలెంజింగ్ ఆర్మ్స్, లెగ్స్‌లో డెఫినిషన్ కోసం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెడతారు.

వారంలో 5 రోజులపాటు 60-90 నిమిషాలు వర్కౌట్​ చేస్తారట మహేష్​. చెస్ట్, బ్యాక్, షోల్డర్స్, ఆర్మ్స్, లెగ్స్ అన్నింటికీ తగిన వ్యాయామం అందేలా కష్టపడతారట. వెయిట్ లిఫ్టింగ్, HIIT, యోగా, పిలాటెస్, ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ పెంచడానికి స్ట్రెచింగ్, యాక్షన్ సీన్స్‌కి సపోర్ట్ చేసేలా బాడీని రెడీగా ఉంచుతారు.. సిక్స్-ప్యాక్ ఏబ్స్ కాదు, ఓవరాల్ స్ట్రెంగ్త్, బ్యాలెన్స్ పై ఫోకస్ చేస్తారట. రెస్ట్ రోజుల్లో లైట్ యోగా లేదా వాకింగ్ చేస్తారట మహేష్​.

రోజుకి 5-6 మీల్స్, టూ సప్లిమెంట్ షేక్స్, ప్రోటీన్, కార్బ్స్, హెల్తీ ఫ్యాట్స్ బ్యాలెన్స్​గా ఉండేలా చూసుకుంటారట మహేష్​. ఆయన ఏం టైమ్​లో ఏం తినాలనేది ఆయన భార్య నమ్రత శిరోడ్కర్ మానిటర్ చేస్తారట. బ్రేక్​పాస్ట్​గా మూష్ (ఓట్స్ + ఎగ్స్ + నట్స్ + ఫ్రూట్స్), ఇడ్లీ, దోస, పూరీ, స్ప్రౌట్స్, పోస్ట్-వర్కౌట్ ప్రోటీన్ షేక్, లంచ్​లోకి చికెన్/లాంబ్/ఫిష్ + బ్రౌన్ రైస్/క్వినోవా/ఖస్ ఖస్, డిన్నర్​కి బ్రౌన్ బ్రెడ్ + ఎగ్స్/చికెన్ ఇలా జాగ్రత్తగా ప్లాన్​ చేస్తుందట నమ్రత. అంతేకాదు, రోజుకు 3-4 లీటర్ల నీరు, గ్రీన్ టీ తీసుకుంటారట మహేష్​. ఇది మెటబాలిజం బూస్ట్ చేసి, లీన్ మసిలర్ ఫ్రేమ్ మెయింటైన్ చేస్తుంది. ‘ఫిట్‌నెస్ లైఫ్‌లాంగ్ కమిట్‌మెంట్’ అనేది మహేష్​ ఫిట్​నెస్​ మంత్ర.. మీరు కూడా మహేష్​ని ఫాలో అయిపోయి యంగ్​గా మెరిసిపోండి!

Follow Us