ఆ ట్వీట్‌కు అర్థమేంటి ‘అల..’ యూనిట్..?

ఫేక్ కలెక్షన్స్, ఫేక్ లైక్స్, ఫేస్ వ్యూస్… ఈ మధ్యకాలంలో ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ తరచుగా వినిపిస్తున్న పదాలు. గంటలోనే మా మూవీ టీజర్‌కు ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి, సౌతిండియాలోనే మా మూవీ ట్రైలర్ రికార్డులు బ్రేక్ చేసింది అంటూ దర్శకనిర్మాతలు తమ సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. అలాగే సినిమా విడులైనప్పుడు ఒక్క రోజుల్లోనే మా మూవీకి ఇన్ని కోట్లు వచ్చాయి, అన్ని కోట్లు వచ్చాయి అంటూ వారు ట్వీట్లు పెడుతుంటారు. ఇక టాప్ హీరోల […]

ఆ ట్వీట్‌కు అర్థమేంటి అల.. యూనిట్..?

Edited By:

Updated on: Dec 14, 2019 | 1:58 PM

ఫేక్ కలెక్షన్స్, ఫేక్ లైక్స్, ఫేస్ వ్యూస్… ఈ మధ్యకాలంలో ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ తరచుగా వినిపిస్తున్న పదాలు. గంటలోనే మా మూవీ టీజర్‌కు ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి, సౌతిండియాలోనే మా మూవీ ట్రైలర్ రికార్డులు బ్రేక్ చేసింది అంటూ దర్శకనిర్మాతలు తమ సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. అలాగే సినిమా విడులైనప్పుడు ఒక్క రోజుల్లోనే మా మూవీకి ఇన్ని కోట్లు వచ్చాయి, అన్ని కోట్లు వచ్చాయి అంటూ వారు ట్వీట్లు పెడుతుంటారు. ఇక టాప్ హీరోల సినిమాలకైతే ఇవీ మరీ ఎక్కువగా ఉంటాయి. మరోవైపు వీటి విషయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధాలు కూడా నడుస్తుంటాయి. అయితే ఇవన్నీ పక్కనపెడితే ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ టీమ్ చేసిన ఓ ట్వీట్‌కు అర్థమేంటన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ సినిమా టీజర్ ఈ నెల 11న విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు 24 గంటల్లోనే 10మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. దాన్ని సోషల్ మీడియాలో తెలిపిన నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్.. ‘‘అభిమానులు, టాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి నిజమైన ప్రేమ లభించింది. మాకు మద్దతిచ్చిన అందరికీ థ్యాంక్స్. 10 మిలియన్ రియల్ లైట్ వ్యూస్‌తో అల వైకుంఠపురంలో టీజర్ యూట్యూబ్‌లో టాప్ ‌1లో ఉంది. ఇంకా వ్యూస్ కంటిన్యూ అవుతున్నాయి’’ అని ట్వీట్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రియల్ టైమ్ వ్యూస్ అన్న దానికి నెటిజన్ల నుంచి విభిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ #AVPLTeaserFakeViewsతో ఆ ట్వీట్‌ను ట్రోల్ చేస్తున్నారు. రియల్ టైమ్ వ్యూస్ అంటూ జోకులు వేస్తున్నారని వారు మీమ్స్ పెడుతున్నారు. అయితే సరిలేరు నీకెవ్వరు టీజర్, పాటలు విడుదలైనప్పుడు వాటి వ్యూస్, లైక్స్‌పై బన్నీ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

అయితే మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురంలో సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్నాయి. ముందుగా ఈ రెండు సినిమాలను ఒకే రోజున విడుదల చేయాలనుకున్నారు. దీంతో అప్పటి నుంచి మహేష్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఇరు మూవీ నిర్మాతలు ఓ అభిప్రాయానికి రావడంతో ఫ్యాన్స్ మధ్య వార్ సద్దుమణుగుతుందని అందరూ భావించారు. కానీ వారు మాత్రం ఆగేలా లేరు. అటు మహేష్, ఇటు బన్నీ ఫ్యాన్స్ ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రత్యర్థి హీరోపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.