‘మహేష్ 26’కి ముహూర్తం కుదిరింది..?

‘మహర్షి’ విజయంతో జోష్ మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ లేదా ‘రెడ్డి గారి అబ్బాయి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం లాంచింగ్‌కు సంబంధించిన ఓ వార్త […]

మహేష్ 26కి ముహూర్తం కుదిరింది..?

Updated on: May 29, 2019 | 7:05 PM

‘మహర్షి’ విజయంతో జోష్ మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ లేదా ‘రెడ్డి గారి అబ్బాయి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం లాంచింగ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం మే 31న సూప‌ర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు సంద‌ర్భంగా ఉద‌యం 9:18ని.ల‌కు ఈ చిత్రాన్ని లాంచ్ చేయ‌నున్నారట. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా, విలన్‌గా జగపతి బాబు నటించనున్నారని సమాచారం. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.