Maa Elections 2021: ప్రకాష్ రాజ్ విందు రాజకీయం పై బండ్లగణేష్ సంచలన వ్యాఖ్యలు.. మా ప్రాణాలతో చెలగాటమడోద్దు అంటూ..

మా ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ఇప్పటికే ఎవరి రాజకీయాలు వారు మొదలు పెట్టేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది.

Maa Elections 2021: ప్రకాష్ రాజ్ విందు రాజకీయం పై బండ్లగణేష్ సంచలన వ్యాఖ్యలు.. మా ప్రాణాలతో చెలగాటమడోద్దు అంటూ..
Bandlaganesh

Updated on: Sep 12, 2021 | 12:46 PM

Maa Elections 2021: మా ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ఇప్పటికే ఎవరి రాజకీయాలు వారు మొదలు పెట్టేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. మొన్న మధ్య నరేష్ తన మెంబర్స్‌తో ఓ హోటల్‌లో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా తన ప్యానల్ మెంబర్స్‌తో విందు ఏర్పాటు చేశారు. “ప్రియమైన సిని”మా” బిడ్డలకు… కలసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం… ప్రతిష్ఠని, పటిష్టతని పెంచే దిశగా…మన లక్ష్యాలు మాట్లాడుకుందాం… మాట్లాడుకున్నాక సహపంక్తి భోజనం చేద్దాం.. అంటూ ఓ ఇన్విటేషన్ ను పంపారు. దీని పై బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ఇలా విందు రాజకీయాలు చేయడం పై బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు.

ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో బండ్ల మాట్లాడుతూ.. లంచ్‌లు డిన్నర్ల పేరుతో మా సభ్యులను ఒక చోట చేర్చడంపై బండ్ల గణేష్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి మా కళాకారులను ఒక దగ్గర చేర్చి. విందులు , సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరం కరోనా భయంతో బ్రతుకుతున్నాం.. చాల మంది చావుదాకా వెళ్లివచ్చారు. అందులో నేను ఒకడిని.. ఓటు కావాలంటే ఫోన్‌ చేసి, మీరు ఏం అభివృద్ధి  చేస్తారో చెప్పండి. అంతే కానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి మా ప్రాణాలతో చెలగాటమడోద్దు.. అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఇక ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ప్రత్యక్షం అయ్యారు. దాంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగారు.. జీవిత పై  నేను పోటీ చేస్తా.. చేసి భారీ మెజారిటీతో గెలుస్తా..  అంటూ ఆయన బయటకు వచ్చిన విషయం తెలిసిందే..

It’s my humble request ? pic.twitter.com/fFaXAiEK4g

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌ను కాపాడింది నేనే.. ఆయన హీరో అని నాకు తెలియదు: అబ్దుల్ ఫర్హాన్

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల.. టెన్షన్ లేదన్న వైద్యులు..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు.. అతివేగం, ర్యాష్ డ్రైవింగే కారణం..