ప్రేయసి లైవ్ చాట్.. సల్మాన్ ఏం చేశాడో తెలుసా..!

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాల ద్వారా వారి ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ ప్రియురాలు లులియా వంతూర్‌

ప్రేయసి లైవ్ చాట్.. సల్మాన్ ఏం చేశాడో తెలుసా..!

Edited By:

Updated on: Apr 19, 2020 | 4:06 PM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాల ద్వారా వారి ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ ప్రియురాలు లులియా వంతూర్‌.. సోషల్ మీడియాలో ఇటీవల లైవ్‌ చాట్ చేశారు. ఆ నేపథ్యంలో అనుకోకుండా ఆ లైవ్‌లోకి సల్మాన్‌ ఖాన్‌ వచ్చారు. లులియా లైవ్‌లో ఉన్న విషయం తెలియని సల్లూ భాయ్‌ ఆమె రూమ్‌లోకి వెళ్లారు. ఆ తరువాత లులియా లైవ్‌లో ఉందన్న విషయం తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ వీడియోలో లులియా సల్మాన్‌కు హాయ్ చెప్పడంతో పాటు.. ఆయన వెళ్లిన తరువాత ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ను చూసి ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనతో పాటు సోదరి అర్పితా ఖాన్ శర్మ, అల్లుడు నిర్వాన్, హీరోయిన్‌ జాక్వలిన్ ఫెర్నాండేజ్‌, వలూచ డిసౌజా, లులియా వంతూర్ అదే ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ఈ లాక్‌డౌన్‌లో తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తున్నారు సల్మాన్‌.

Read This Story Also: పుష్ప: బన్నీ, రష్మిక పాత్రల గురించి షాకింగ్ న్యూస్‌..!