Ramayanam: నెగెటివ్ కామెంట్స్‌తో స్టార్ హీరోను ట్రోల్ చేస్తున్న అభిమానులు? అసలేం జరిగింది?

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన కెరీర్‌లో అనేక వివాదాల్లో పడినా, ఈసారి సినిమా పాత్ర కోసం చేసిన 'సాత్విక్ డైట్' క్లెయిమ్ మీదే టార్గెట్ అయ్యాడు. 'రామాయణం' చిత్రంలో శ్రీరాముడిగా నటించడానికి వెజిటేరియన్ డైట్, స్మోకింగ్ క్విట్, మెడిటేషన్, మార్నింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నానని చెప్పి ..

Ramayanam: నెగెటివ్ కామెంట్స్‌తో స్టార్ హీరోను ట్రోల్ చేస్తున్న అభిమానులు? అసలేం జరిగింది?
Star Hero In Ramayanam

Updated on: Nov 26, 2025 | 6:15 AM

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన కెరీర్‌లో అనేక వివాదాల్లో పడినా, ఈసారి సినిమా పాత్ర కోసం చేసిన ‘సాత్విక్ డైట్’ క్లెయిమ్ మీదే టార్గెట్ అయ్యాడు. ‘రామాయణం’ చిత్రంలో శ్రీరాముడిగా నటించడానికి వెజిటేరియన్ డైట్, స్మోకింగ్ క్విట్, మెడిటేషన్, మార్నింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నానని చెప్పి, అందరినీ ఆకట్టుకున్న రణ్​బీర్​.. ఇప్పుడు ఒక వైరల్ వీడియోతో హిపోక్రిసీ బారినపడ్డాడు. ఏంటా కాన్‌ట్రవర్సీ? ఎందుకు నెటిజన్స్ ఆగ్రహం?

‘రామాయణం’ చిత్రం నితీష్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. రణ్​బీర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాగా, రవి దుబే లక్ష్మణుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రూపొందుతోంది. రాముని పాత్రకు గౌరవం ఇచ్చేందుకు రణబీర్ తన లైఫ్‌స్టైల్ మార్చుకున్నానని ప్రకటించాడు. ‘నాన్-వెజ్, సిగరెట్, ఆల్కహాల్ అన్నీ ఆపేశాను. సాట్విక్ ఫుడ్, యోగా, మెడిటేషన్‌తో డిసిప్లిన్డ్ రొటీన్ ఫాలో అవుతున్నాను’ అని రణ్​బీర్​ పీఆర్ టీమ్ ప్రకటించింది. ఈ న్యూస్ వచ్చినప్పుడు అందరూ రణ్​బీర్​ని ఆకాశానికెత్తారు. ‘వర్క్ కమిట్‌మెంట్ లెవెల్ హై!’ అని అందరూ మెచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు అదే బూమరాంగ్‌గా తిరిగి వచ్చింది.

Ranbeer Kapoor

‘డైనింగ్ విత్ ది కపూర్స్’ డాక్యుమెంటరీలోని ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అయ్యింది. ఆ వీడియోలో రణబీర్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తున్న సీన్ కనిపిస్తుంది. నీతూ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రీమా జైన్, సైఫ్ అలీ ఖాన్ అందరూ కలిసి కూర్చుని తింటున్నారు. ఫిష్ కర్రీ, రైస్, జంగిల్ మటన్, పాయా! రణబీర్ సోదరుడు అర్మాన్ జైన్ సర్వ్ చేస్తుంటే, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే, నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ‘రాముడిగా నటిస్తూ మటన్ తింటావా? సాట్విక్ డైట్ అనేది అబద్ధమేనా?’ అని నెటిజన్స్​ మండిపడుతున్నారు. కొందరు ఇది మూవీ ప్రమోషన్ కోసం పబ్లిసిటీ స్టంట్ అని కూడా అనుమానించారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో #RanbirHypocrisy, #RamayanaControversy లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై రణ్​బీర్​ టీమ్​ ఏం చెబుతుందో చూడాలి మరి!

Follow Us