OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రడీ.. ఈ వారం అదిరిపోయే చిత్రాలు వచ్చేస్తున్నాయ్‌.

|

Oct 05, 2023 | 10:33 AM

ఓటీటీ రంగం శరవేగంగా విస్తరించడంతో బడా నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో నేరుగా ఓటీటీలోనే సినిమాలు విడుదలయ్యే రోజులు వచ్చాయి. కరోనా సమయంలో భారీగా విస్తరించిన ఓటీటీ రంగం సినిమా ఇండస్ట్రీని మలుపుతిప్పింది. దీంతో వీకెండ్‌ వస్తుందంటే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై కూడా ఆసక్తి పెరిగింది...

OTT Movies: ఓటీటీ లవర్స్‌ గెట్‌ రడీ.. ఈ వారం అదిరిపోయే చిత్రాలు వచ్చేస్తున్నాయ్‌.
OTT Movies
Follow us on

ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే కేవలం థియేటర్ల వద్ద మాత్రమే సినిమాల సందడి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో కూడా వీకెండ్ వస్తుందంటే సినిమాల హంగామా స్టార్ట్ అవుతోంది. ఓటీటీ రంగం శరవేగంగా విస్తరించడంతో బడా నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో నేరుగా ఓటీటీలోనే సినిమాలు విడుదలయ్యే రోజులు వచ్చాయి. కరోనా సమయంలో భారీగా విస్తరించిన ఓటీటీ రంగం సినిమా ఇండస్ట్రీని మలుపుతిప్పింది. దీంతో వీకెండ్‌ వస్తుందంటే థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలపై కూడా ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేయండి..

* ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న పెద్ద సినిమా ‘మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి’. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి జంటగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆక్టట్టుకుంది. మంచి కథా, కామెడీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసిందీ మూవీ. అక్టోబర్ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

* ఇక ఈ వారం ఓటీటీ సందడి చేయనున్న మరో చిత్రం ఓ మై గాడ్‌2. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అనే సున్నితమైన కథాంశాన్ని దర్శకుడు బాగా వివరించాడు.

* ఆహాలో సందడి చేయడానికి థ్రిల్లర్‌ మూవీ వచ్చేస్తోంది. హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్‌’ అనే ఇసనిమా ఆహా వేదికగా అక్టోబర్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. దీంతో పాటు మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమా కూడా అక్టోబరు 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* ఇక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 4 నుంచి బెక్‌హమ్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్టోబర్‌ 5వ తేదీ నుంచి ఎవ్రీథింగ్‌ నౌ అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. వీటితో పాటు అక్టోబర్‌ 6వ తేదీ నుంచి ఫెయిర్‌ ప్లే, ఇన్సిడియస్‌ వంటి హాలీవుడ్‌ మూవీస్‌ స్ట్రీమింగ్ కానున్నాయి.

* ఇక అమెజాన్‌ ప్రైమ్‌ విషయానికొస్తే ఈ ఓటీటీలో అక్టోబర్‌ 6వ తేదీ నుంచి ముంబై డైరీస్‌ అనే బాలీవుడ్‌ సినిమా స్ట్రీమిగ్‌ కానుంది.

* జీ5 ఓటీటీలో అక్టోబర్ 6వ తేదీ నుంచి బాలీవుడ్‌ మూవీ గదర్‌ 2 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

* డిస్నీ + హాట్‌స్టార్‌ విషయానికొస్తే ఇందులో ఇప్పటికే అక్టోబర్ 4వ తేదీ నుంచి హంటెడ్‌ మాన్షన్‌ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతోపాటు అక్టోబర్ 6వ తేదీ నుంచి లోకి అనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది.

* జియో సినిమాలో అక్టోబర్ 6వ తేదీ నుంచి గుష్‌పతి – బిట్వీన్‌ బోర్డర్స్‌ అనే హిందీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక అక్టోబర్ 7వ తేదీ ఉనంచి ది డాటర్‌ అనే హిందీ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..