‘తలైవి’లో సరికొత్త కోణం..!

‘తలైవి’ అనే టైటిల్‌తో దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  చిత్రంలో అమ్మ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని హైలైట్ చేస్తూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను రాసుకున్నారట. ముఖ్యంగా ఒక నటిని.. ఒక రాష్ట్రం మొత్తం అమ్మగా భావించడానికి గల కారణాలు ఏంటి అనే పాయింట్ తీసుకుని కథను కొత్త కోణంలో […]

'తలైవి'లో సరికొత్త కోణం..!
Follow us

|

Updated on: May 03, 2019 | 5:12 PM

‘తలైవి’ అనే టైటిల్‌తో దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  చిత్రంలో అమ్మ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని హైలైట్ చేస్తూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను రాసుకున్నారట.

ముఖ్యంగా ఒక నటిని.. ఒక రాష్ట్రం మొత్తం అమ్మగా భావించడానికి గల కారణాలు ఏంటి అనే పాయింట్ తీసుకుని కథను కొత్త కోణంలో రాశారట. ఇదే సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఇక ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Latest Articles