Lata Mangeshkar: లతాజీ మరణానికి కారణమిదే.. ఆమెకు చికిత్సనందించిన డాక్టర్‌ ఏమన్నారంటే..

|

Feb 06, 2022 | 11:53 AM

లెజెండరీ సింగర్‌, ఇండియన్‌ నైటింగెల్‌, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ ఉదయం కన్నుముశారు.

Lata Mangeshkar: లతాజీ మరణానికి కారణమిదే.. ఆమెకు చికిత్సనందించిన డాక్టర్‌ ఏమన్నారంటే..
Follow us on

లెజెండరీ సింగర్‌, ఇండియన్‌ నైటింగెల్‌, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ ఉదయం కన్నుముశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్ (Covid19) స్వల్ప లక్షణాలతో ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా కూడా సోకడంతో డాక్టర్‌ ప్రతీత్ సంధాని నేతృత్వంలోని ప్రత్యేక వైద్యుల బృందం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. గత నెల చివరిలో ఆమె కరోనాతో పాటు న్యుమోనియా నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె వయసు దృష్ట్యా ఐసీయూలోనే ఉంచి చికిత్స కొనసాగించారు వైద్యులు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నాం లతాజీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తూ ఈరోజు ఉదయం గాన కోకిల తుది శ్వాస విడిచారు.

పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతోనే..

కాగా మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌ తోనే లతా మంగేష్కర్ మరణించినట్లు బ్రీచ్ కాండీ హాస్పిటల్‌ డాక్టర్ ప్రతీత్ సంధాని వెల్లడించారు. ‘కొవిడ్ బారిన పడిన లతాజీకి 28 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నాం. ఆమె కరోనాను జయించారు. అయితే పోస్ట్ కోవిడ్ తర్వాత లతాజీ శరీరంలోని పలు అవయవాలు దెబ్బతిన్నాయి. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌ కారణంగానే ఆమె తుదిశ్వాస విడిచారు. లతాజీ క్షేమంగా కోలుకుంటారని అందరూ భావిస్తున్న సమయంలోనే ఆమె ఆరోగ్యం విషమించింది. ఆదివారం ఉదయం 8.12 గంటలకు లతాజీ కన్నుమూశారు. ఆమె మరణానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం’ అని ప్రతీత్‌ పేర్కొన్నారు.