తెలుగులో దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు పొందాడు కిచ్చా సుదీప్. అటు కన్నడలో స్టార్ హీరోగా ఉన్న సుదీప్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈగ విలన్‌గానే పరిచయమయ్యడు. ఇక ఆ మూవీ తర్వాత బహుబలి సినిమా చిన్నా పాత్రలో కనిపించాడు హీరో. తాజాగా కిచ్చా సుదీప్ అరుదైన రికార్డు సాధించాడు.
ప్రస్తుతం కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విక్రాంత్ రానా’. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవూ ఫస్ట్ లుక్‌తోపాటు వీడియోను కూడా రివీల్ చేశారు. అది కూడా ప్రపంచంలోనే ఎత్తైన బూర్జ్ ఖలీఫాపై వీటిని ఆవిష్కరించారు. దాదాపు 2000 ఫీట్ల పొడవుతో సుదీప్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. దీంతో సుదీప్ రికార్డ్ సృష్టించారు. ఇక సినీ ఇండస్ట్రీలోకి సుదీప్ అడుగుపెట్టి ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్బంగా విక్రాంత్ రానా మేకర్స్ బూర్జ్ ఖలీఫాపై పోస్టర్‌తోపాటు 180 సెకండ్ల నిడివిగల స్నేక్ పీక్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సుదీప్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.
Thanks @BurjKhalifa fr personally sending me this video .. thanks #Dubai for hosting us soo well.
Mch luv ??.Wil be posting a HD video of the same wth a greater sound quality n a grander view, tomorrow.
Thanking all u frnzz once again fr the unconditional luv,,thru & thru.
?? pic.twitter.com/XLFIbrxp2h— Kichcha Sudeepa (@KicchaSudeep) January 31, 2021
Also Read:
ఎమ్మెల్యేగా కనిపించనున్న నారా రోహిత్.. బాలయ్య కోసం సరికొత్తగా.. ట్విస్ట్ ఇవ్వడం కోసమేనంటా ?