ఈ ఏడాది లక్కీ హీరోయిన్.. వరుస ఆఫర్లతో ఫుల్ బిజి.. ఆ హీరో సరసన నటించే ఛాన్స్.. ఎవరంటే?..

తను నటించిన తొలి తెలుగు సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఆ హీరోయిన్ పాపులర్ అయ్యింది. అంతే కాకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది కృతి షెట్టి.

ఈ ఏడాది లక్కీ హీరోయిన్.. వరుస ఆఫర్లతో ఫుల్ బిజి.. ఆ హీరో సరసన నటించే ఛాన్స్.. ఎవరంటే?..
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 16, 2020 | 10:02 PM

తను నటించిన తొలి తెలుగు సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఆ హీరోయిన్ పాపులర్ అయ్యింది. అంతే కాకుండా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ రికార్డులు సృష్టిస్తుంది కృతి షెట్టి. సాయిధరమ్ సోదరుడు వైష్ణవ్ తేజతో ఉప్పెన సినిమాలో జోడి కట్టింది ఈ భామ. ఉప్పెన ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. కానీ ఈ హీరోయిన్ అప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. అంతేకాకుండా కరోనా సంక్షోభంలో కూడా ఈ అమ్మడు వరుస ఆఫర్లను కోట్టేస్తుంది. తాజాగా గోపిచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అలివేలుమంగ వెంకటరమణ సినిమాలోకి కృతి షెట్టిని ఎంపిక చేసినట్టుగా ఫీల్మ్ నగర్‏లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోకి కృతి షెట్టిని కూడా తీసుకుంటున్నట్లుగా వినిపిస్తోంది. మరీ హీరో గోపిచంద్‏కు జోడీగా ఈ ఇద్దరిలో ఎవరు నటించబోతున్నారు? ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా? లేదా ? అనేది చూడాలి.