AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో సినిమాకు ఒకే చెప్పినా ఆ టాప్ స్టార్ హీరో.. వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్..

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ తళపతి. ఆయన నటించిన ప్రతీ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాల్సిందే.

మరో సినిమాకు ఒకే చెప్పినా ఆ టాప్ స్టార్ హీరో.. వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 16, 2020 | 2:41 PM

Share

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ తళపతి. ఆయన నటించిన ప్రతీ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాల్సిందే. ఈ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. అటు తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా విజయ్ సినిమాలకు తెలుగులో కూడా ఎక్కువే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. లాక్‏డౌన్ సమయంలో సినిమాలకు దూరమైన అభిమానులు తాజాగా విజయ్ సినిమా సంక్రాతికి రిలీజ్ కాబోతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ స్టార్ హీరో విజయ్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ ఈ మూవీని తెరకెక్కించనుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‏పై ఈ మూవీని నిర్మించనున్నారు. సంక్రాతి తర్వాత ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం చేసేలా సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఇక అన్ని పనులు అనుకున్నట్టుగా జరిగితే విజయ్ నటించబోయే మరో కొత్త సినిమా కూడా దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారట ప్రొడ్యూసర్స్. వచ్చే ఏడాదిలో విజయ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో ఫ్యాన్స్ తెగ సంబంరపడిపోతున్నారు.

Follow Us
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..