రామ్‌ చరణ్‌కి పెద్ద అభిమానిని.. ఆయన సినిమాలన్నీ చూశా.. ‘ఉప్పెన’ బ్యూటీ

| Edited By:

Nov 15, 2020 | 1:44 PM

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది కృతి శెట్టి. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్‌లు, లిరికల్‌ వీడియోలలో కృతి లుక్స్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌లు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి.

రామ్‌ చరణ్‌కి పెద్ద అభిమానిని.. ఆయన సినిమాలన్నీ చూశా.. ఉప్పెన బ్యూటీ
Follow us on

Krithi Shetty Ram Charan: మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది కృతి శెట్టి. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్‌లు, లిరికల్‌ వీడియోలలో కృతి లుక్స్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌లు అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఉప్పెన విడుదల అవ్వకముందే ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్‌, సుధీర్‌ బాబు-మోహన్ కృష్ణ ఇంద్రగంటి మూవీల్లో ఛాన్స్‌ కొట్టేసింది కృతి. మరికొన్ని మూవీలు కూడా లైన్‌లో ఉన్నట్లు సమాచారం. (
ముగిసిన మరో శకం.. ప్రముఖ నటుడు, ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత)

ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్యూలో కృతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగులో వ్యక్తిగతంగా రామ్ చరణ్‌ అంటే చాలా ఇష్టమని, అతడి అన్ని సినిమాలు చూశానని కృతి అన్నారు. ఇక టాలీవుడ్‌ ద్వారానే హీరోయిన్‌గా ఎంట్రీ అవుతానని అనుకోలేదని, దర్శకుడు బుచ్చిబాబు కథ చెప్పినప్పుడే తన పాత్ర చాలా బాగా వస్తుందని భావించానని తెలిపారు. కాగా ఉప్పెన నుంచి ఇప్పటికే వచ్చిన మూడు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయి. అన్నీ కుదిరితే ఈ మూవీ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. (అమ్మ చీరతో పిల్లలకు డ్రెస్‌లు కుట్టించిన హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌)